మనోభావాలు Vs బాస్ పార్టీ.. ఎవరిది పైచేయి?

భారీ అంచనాల మధ్య వీరసింహారెడ్డి సినిమా నుంచి స్పెషల్ సాంగ్ రిలీజైంది. “మా బావ మనోభావాలు” అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను ఈరోజు విడుదల చేశారు. ఇప్పటికే రిలీజైన వాల్తేరు వీరయ్య…

భారీ అంచనాల మధ్య వీరసింహారెడ్డి సినిమా నుంచి స్పెషల్ సాంగ్ రిలీజైంది. “మా బావ మనోభావాలు” అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను ఈరోజు విడుదల చేశారు. ఇప్పటికే రిలీజైన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ స్పెషల్ సాంగ్ కు, ఈ ప్రత్యేక గీతం పోటీనిస్తుందని అంతా భావిస్తున్నారు.

బాలకృష్ణ, ఐటమ్ బాంబ్ చంద్రికా రవి కలిసి స్టెప్పులేసిన లిరికల్ వీడియో రిలీజైంది. “మా బావ మనోభావాలు” స్పెషల్ సాంగ్ లో మరోసారి తన మార్క్ బీట్ చూపించాడు తమన్. హై ఎనర్జీతో సాగింది ఈ పాట.

రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట సాహిత్యం ప్రధాన ఆకర్షణ. పాట కొరియోగ్రఫీ కూడా బాగుంది. బాలయ్య సిగ్నేచర్ స్టెప్పులు 2-3 కనిపిస్తున్నాయి.

వాల్తేరు వీరయ్యలోని బాస్ పార్టీ పాట ఇప్పటికే హిట్టయింది. పైగా దీన్ని సినిమా ప్రచారం కోసం కూడా వాడేస్తున్నారు. అవతార్2, ధమాకా లాంటి సినిమాల ఇంటర్వెల్ టైమ్ లో ఈ పాట కనిపిస్తోంది. అలా జనాల్లోకి పాట బాగా చొచ్చుకుపోయింది. దీంతో 'మనోభావాలు' సాంగ్ పై ఒత్తిడి పెరిగింది.

బాస్ పార్టీ పాటకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా.. మనోభావాలు సాంగ్ ను తమన్ కంపోజ్ చేశాడు. ఈ రెండు ప్రత్యేత గీతాల్లో ఏది పెద్ద హిట్టవుతుంది, ఏ సంగీత దర్శకుడు పైచేయి సాధిస్తాడనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.