మరో లవ్ ఎఫైర్ బయటపడింది. హీరోయిన్ అవికా గౌర్ లవర్ ఎవరో తెలిసిపోయింది. తన ప్రియుడు ఎవరనే విషయాన్ని ఆమె స్వయంగా బయటపెట్టింది. మిలింద్ చద్వానీ అనే వ్యక్తితో అవికా ప్రేమలో ఉంది. ఈ మేరకు ఆమె కొన్ని ఫొటోలు రివీల్ చేసింది.
“నా లైఫ్ లో లవ్ దొరికింది. నన్ను అర్థం చేసుకొని, నాలో స్ఫూర్తి నింపి, నన్ను జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి దొరకడం నా అదృష్టం” అంటూ ఓ పెద్ద కవితను పోస్టు చేసి మరీ తన ప్రేమ సంగతిని బయటపెట్టింది అవికా గౌర్.
సంతోషంగా ఉంచేందుకు, తన జీవితంలోకి ఓ వ్యక్తి వచ్చాడని తెలిపిన అవికా గౌర్, ఇదొక అందమైన అనుభూతి అంటోంది. ఈ సందర్భంగా పెళ్లిపై కూడా ఈ ముద్దుగుమ్మ క్లారిటీ ఇచ్చింది. ఇప్పట్లో తామిద్దరం పెళ్లి చేసుకోమని కూడా తెలిపింది.
తెలుగులో లక్ష్మీరావే మా ఇంటికి, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, సినిమా చూపిస్త మామ, ఉయ్యాల జంపాల సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది అవిక. రీసెంట్ గా ఈమె స్లిమ్ గా మారి హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసి మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.