బంగారం లాంటి ఓపెనింగ్ మిస్ చేసుకున్న సినిమా

సినిమాను బాగా తీయడం ఎంత అవసరమో.. దాన్ని పక్కాగా రిలీజ్ చేయడం కూడా అంతే అవసరం. సరైన రిలీజ్ డేట్ చూసుకోవడం, మంచి థియేటర్లు సెట్ చేసుకోవడం కూడా విజయంలో కీలక పాత్ర పోషిస్తున్న…

సినిమాను బాగా తీయడం ఎంత అవసరమో.. దాన్ని పక్కాగా రిలీజ్ చేయడం కూడా అంతే అవసరం. సరైన రిలీజ్ డేట్ చూసుకోవడం, మంచి థియేటర్లు సెట్ చేసుకోవడం కూడా విజయంలో కీలక పాత్ర పోషిస్తున్న రోజులివి. ఇలాంటి ఓ మహత్తరమైన రిలీజ్ డేట్ ను అయలాన్ పోగొట్టుకుంది.

శివకార్తికేయన్ హీరోగా నటించిన సినిమా అయాలన్. కోలీవుడ్ లో పొంగల్ కానుకగా ఈ సినిమా రిలీజైంది. తెలుగులో మాత్రం సంక్రాంతికి ఈ సినిమాకు థియేటర్లు దొరకలేదు. అలా వాయిదాపడిన అయలాన్ సినిమా, రిపబ్లిక్ డేకు వస్తున్నట్టు ప్రకటించుకుంది.

ఆల్రెడీ కోలీవుడ్ లో హిట్టవ్వడం సినిమాకు బాగా కలిసొచ్చింది. అంతా సెట్ అనుకున్న టైమ్ లో షాక్ తగిలింది. ఈరోజు అయలాన్ సినిమా రిలీజ్ కాలేదు.

తెలుగు రిలీజ్ కు సంబంధించి ఆర్థికపరమైన సమస్యలతో పాటు, కొన్ని లీగల్ ఇష్యూలు తలెత్తడంతో ఆఖరి నిమిషంలో అయలాన్ సినిమాను థియేటర్ల నుంచి తప్పించారు. ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్న ప్రేక్షకులకు డబ్బు తిరిగి చెల్లించారు. 

సంక్రాంతి సినిమాల సందడి తగ్గడంతో, అయలాన్ కు తెలుగు రాష్ట్రాల్లో భారీగా థియేటర్లు దక్కాయి. అందుకు తగ్గట్టే ఓ ఫంక్షన్ పెట్టి గ్రాండ్ గా ప్రచారం కూడా చేశారు. కానీ ఇలా ఆఖరి నిమిషంలో సినిమా షోలు రద్దయ్యాయి.