రాబిన్ హుడ్.. తెలుగు తెరపైకి మరో దొంగ

టాలీవుడ్ కు 'దొంగ' సినిమాలు కొత్తేం కాదు. ఈ వాక్యాన్ని మరోలా అర్థం చేసుకోవద్దు. హీరోను దొంగగా చూపించే సినిమాలు అని అర్థం. అలీబాబా నుంచి నిన్నటి టైగర్ నాగేశ్వరరావు వరకు చాలామంది హీరోలు…

టాలీవుడ్ కు 'దొంగ' సినిమాలు కొత్తేం కాదు. ఈ వాక్యాన్ని మరోలా అర్థం చేసుకోవద్దు. హీరోను దొంగగా చూపించే సినిమాలు అని అర్థం. అలీబాబా నుంచి నిన్నటి టైగర్ నాగేశ్వరరావు వరకు చాలామంది హీరోలు దొంగలుగా తెరపైకొచ్చారు. ఇప్పుడీ లిస్ట్ లోకి నితిన్ కూడా చేరాడు.

నితిన్, వెంకీ కుడుముల కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి రాబిన్ హుడ్ అనే టైటిల్ పెట్టారు. గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో దొంగగా కనిపిస్తున్నాడు నితిన్.

ఇప్పటికే తెరపై ఎంతోమంది దొంగల్ని చూసిన తెలుగు ప్రేక్షకులకు కొత్తరకం దొంగను పరిచయం చేస్తున్నాడు దర్శకుడు. దొంగతనం తన ప్రాధమిక హక్కు అంటున్నాడు ఇందులో హీరో. గ్లింప్స్ లో చెప్పిన డైలాగ్ తో హీరో పాత్రతో పాటు, సినిమా జానర్ ను కూడా ఒకేసారి చెప్పినట్టయింది.

దొంగ పాత్రలో నితిన్ ఎంట్రీ బాగుంది. ఖరీదైన బైక్ పై, శాంటాక్లాజ్ గెటప్ లో నితిన్ కనిపించాడు. కట్ చేస్తే, స్టయిలిష్ డ్రెస్ లో కనిపిస్తాడు. కొట్టేసిన నగలు, నగదు మొత్తాన్ని ఎత్తుగా ఉన్న ఓ ప్రదేశంలో దాచిపెట్టడాన్ని గ్లింప్స్ లో చూపించారు.

రాబిన్ హుడ్ గ్లింప్స్ లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. గతంలో కొన్ని సినిమాల్లో కనిపించినట్టుగానే నితిన్, ఈ సినిమాలో గుబురు గడ్డంలో కనిపించాడు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.