జనసేనాని పవన్‌కల్యాణ్ ఇవాళ పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడు పొత్తు ధర్మాన్ని పాటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పొత్తులో ఉంటూ, కనీసం నామమాత్రంగా కూడా చర్చించకుండా రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులపై ప్రకటించడంపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పవన్‌కు మంత్రి అంబటి రాంబాబు హితవుతో కూడిన సూచన చేశారు. ఈ మేరకు అంబటి రాంబాబు ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ పోస్టు చేశారు. అదేంటంటే..
“పొత్తు ధర్మమే కాదు ఏ ధర్మము పాటించని వాడే “బాబు” తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్!”
పవన్‌కల్యాణ్ కామెంట్స్‌నే తీసుకుని పవన్‌కల్యాణ్‌కు జ్ఞానోదయం చేసేందుకు అంబటి ప్రయత్నించారు. పవన్‌కు సంబంధించి ప్రతి చిన్న కదలికపై అంబటి తనదైన రీతిలో స్పందించే సంగతి తెలిసిందే. పవన్, అంబటి ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు. దీంతో తనపై అంబటి, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని తదితర తన సామాజిక వర్గ నేతలతో జగన్ విమర్శలు చేయిస్తుంటారని పవన్ వాపోతుంటారు. ఇప్పుడు పవన్‌ను టార్గెట్ చేయడానికే ఆయన ఆయుధం ఇచ్చారు. అంబటి హిత వచనాలను పవన్ ఏ విధంగా తీసుకుంటారో!