అయ్యప్పన్ లో ఐశ్వర్య?

గ్లామర్ డాల్ గా కాకున్నా మంచి నటిగా ప్రూవ్ చేసుకుంది ఐశ్వర్య. ఒకప్పటి హీరో రాజేష్ కూతురు. హాస్యనటి శ్రీలక్ష్మి మేనకోడలు. తెలుగులో ఇప్పటికే మంచి పాత్రలు చేసిన ఐశ్వర్య పేరు ఒక్కసారిగా టాలీవుడ్…

గ్లామర్ డాల్ గా కాకున్నా మంచి నటిగా ప్రూవ్ చేసుకుంది ఐశ్వర్య. ఒకప్పటి హీరో రాజేష్ కూతురు. హాస్యనటి శ్రీలక్ష్మి మేనకోడలు. తెలుగులో ఇప్పటికే మంచి పాత్రలు చేసిన ఐశ్వర్య పేరు ఒక్కసారిగా టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది.

అందులో కీలకమైనది భారీ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ లో గిరిజన యువతిగా ఐశ్వర్య నటిస్తోందన్న వార్తలు ఒక్కసారిగా హల్ చల్ చేయడం ప్రారంభమైంది. ఈ విషయం అఫీషియల్ గా కన్ఫర్మ్ కావాల్సి వుంది.

ఇదిలా వుంటే అయ్యప్పన్ కోషియన్ రీమేక్ లో కూడా ఐశ్వర్యను తీసుకునే ఆలోచనలు సాగుతున్నట్లు తెలుస్తోంది.అయ్యప్పన్ లో పవన్ పాత్ర అయిన మిడిల్ ఏజ్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రకు జోడీగా ఐశ్వర్యను తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయ్యప్పన్ లో ఈ పాత్రకు కూడా మంచి నిడివి, మంచి ప్రాధాన్యత వుంది. మాంచి ఎమోషన్ సీన్లు కూడా వున్నాయి. అందువల్ల ఈ పాత్రకు ఐశ్వర్య పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

అన్నీ అనుకున్నట్లు జరిగి ఆర్ఆర్ఆర్, అయ్యప్పన్ ల్లో కనుక ఐశ్వర్య ఫిక్స్ అయితే ఇకపై మరిన్ని మంచి మంచి పాత్రలు ఇంకా ఆమెను వెదుక్కుంటూ వచ్చే అవకాశం వుంది.

శాపనార్థాలు, ఆక్రోశాలు తప్ప వారికేం మిగిలట్లేదు