బాబాయ్ బర్త్ డే మర్చిపోయావా అబ్బాయ్!

బాలయ్య బాబాయ్ బర్త్ డే ఈ రోజు. అందువల్ల అబ్బాయి తారక్ విసెష్ చెప్పాలి కదా? ఫోన్ లో చెప్పి వుంటారేమో? సోషల్ మీడియాలో మాత్రం చెప్పలేనట్లే అనుకోవాలి. ఏ ట్వీట్ వేయకపోవడంతో. Advertisement…

బాలయ్య బాబాయ్ బర్త్ డే ఈ రోజు. అందువల్ల అబ్బాయి తారక్ విసెష్ చెప్పాలి కదా? ఫోన్ లో చెప్పి వుంటారేమో? సోషల్ మీడియాలో మాత్రం చెప్పలేనట్లే అనుకోవాలి. ఏ ట్వీట్ వేయకపోవడంతో.

అంతే కాదు, అనిల్ రావిపూడి డైరక్షన్ లో తయారవుతున్న భగవత్ కేసరి టీజర్ గురించి ఓ మాట అయినా చెప్పి వుండాల్సింది. అదీ జరగలేదు. నందమూర కళ్యాణ్ రామ్ మాత్రం ఓ ట్వీట్ వేసారు. టీజర్ చూసా బాగుంది..పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ.

కానీ ఎన్టీఆర్ వైపు నుంచి అలాంటిదేమీ కనిపించలేదు. పర్సనల్ గా ఫోన్ లో విష్ చేసారేమో తెలియదు. మొత్తం మీద బాబాయ్-అబ్బాయిల నడుమ సమ్ థింగ్..సమ్ థింగ్ అని అనుకోవాలేమో?

ఈ మధ్యనే ఎన్టీఆర్ బర్త్ డే అయితే లోకేష్ పర్సనల్ గా ట్వీట్ వేసారు. అది చూసి తెలుగుదేశం శ్రేణులు అన్నీ హ్యపీగా ఫీల్ అయ్యాయి కూడా.

ఇటీవల ఎన్టీఆర్-బాలయ్య ఫ్యాన్స్ మధ్య కొంత గ్యాప్ వచ్చింది. కొంతమంది ఇద్దరినీ అభిమానిస్తున్నారు. కొంత మంది ఇటు అటు డివైడ్ అయ్యారు.

గతంలో ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన సందర్భాలు వున్నాయి.