బాహుబలి వన్..ఓ సంచలనం…బాహుబలి వన్ వసూలు చేసిన మొత్తాలే ప్రాతి పదికగా బాహుబలి 2 కొనుగోలు రేట్లు. అదీ ఓ సంచలనం. ఇప్పుడు ఆ రేట్లు ప్రాతిపదికగా ఆర్ఆర్ఆర్ కొనుగోలు రేట్లు. తెలంగాణలో సామన్యుడికి అందనంత ఎత్తులో టికెట్ రేట్లు. ఆంధ్రలో కూడా అంతో ఇంతో ఎక్కువ రేట్లే.
కానీ ఈ రేట్లు మాత్రమే కాదు అనధికారికంగా భయంకరమైన రేట్లు ఫిక్స్ చేస్తున్నారన్న వార్తలు. అయినా బయ్యర్లు భయపడుతున్నారు ఎందుకు? బాహుబలి సిరీస్ కు ఆర్ఆర్ఆర్ కు చాలా తేడా వుంది. ఇంకా చెప్పాలంటే తేడాలు వున్నాయి. అవే బయ్యర్లను కలవరపెడుతున్నాయి.
బాహుబలి పక్కా కమర్షియల్ ప్యాకేజ్. డ్యూయట్లు, గ్లామర్ దాని సొంతం.
ఆర్ఆర్ఆర్ కేవలం ఎమోషనల్ ప్యాకేజీ. డ్యూయట్లు లేవు. ఎమోషనల్ పాటలే. నాటు నాటు పాట ఒక్కటే అడ్వాంటేజ్ కావాలి.
బాహబలికి కోర్టు రెండు వారాల పాటు అయిదు వందల రేటు అవకాశం ఇచ్చింది.
ఆర్ఆర్ఆర్ కు మరీ భయంకరమైన హిట్ టాక్ వస్తే తప్ప, అనధికారికంగా పెట్టే అదనపు రేట్లు వీకెండ్ తరువాత కంటిన్యూ చేయడం సాధ్యం కాదు.
ఆర్ఆర్ఆర్ కు రామ్ చరణ్, ఎన్టీఆర్ మాత్రమే పుల్లింగ్ ఫ్యాక్టర్. రాజమౌళి లెవెల్ లో చిత్రీకరించిన ఫైట్లు. యాక్షన్ సీక్వెన్స్ లు. అదనపు ఆకర్షణలు.
బాహుబలిలో తమన్నా గ్లామర్, అనుష్క.. అయిటమ్ సాంగ్ లు.ఇలా చాలా వుంది వ్యవహారం. ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు మినహా మరే పాట మాస్ ఆడియన్స్ కు పట్టే రేంజ్ లో వుంటాయా? అన్న అనుమానం వుండనే వుంది.
అన్నింటికి మించిన విషయం మరోటి వుంది. బాహుబలి టైమ్ లో ఇంట్లో వున్న ముసిలి, ముతక అందరినీ థియేటర్ కు తీసుకువస్తే ఆ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి.
కానీ అప్పుడు ఓటిటి లేదు. ఇప్పుడు వుంది. అందువల్ల ముసిలి, ముతక వగైరా జనాలను ఇప్పుడు తీసుకువచ్చే అవకాశం తక్కువ. ఓటిటి లో వస్తుందని తెలుసు కనుక వెయిట్ చేస్తారు.
బాహుబలి టైమ్ లో పరిక్షలు అన్నీ ఫినిష్ అయ్యాయి.
ఆర్ఆర్ఆర్ విడుదల టైమ్ లో ఇంకా టెన్త్ పరీక్షలు కాలేదు. ఇంటర్ పరిక్షలు కాలేదు. ప్రయిమరీ, అప్పర్ ప్రయిమరీ పరిక్షలు అవుతున్నాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు పరిక్షలకు ఇచ్చిన ప్రయారిటీ సినిమాలకు ఇవ్వరు.
ఈ యాడ్ పాయింట్లు అన్నీ దాటుకుని సక్సెస్ కావాలంటే బాహుబలిని మించిన అద్భుతమైన, అపూర్వమైన, అసమానమైన టాక్ ఆర్ఆర్ఆర్ కు రావాలి. అలా రాకపోతే అన్నదే బయ్యర్ల భయం…అందుకే వారు ముఫై శాతం కొనుగోలు రేట్లు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నది.