తన రెండు సినిమాలతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నటుల్ని బ్యాక్ టు బ్యాక్ రిపీట్ చేస్తున్నాడు బాలయ్య. ఓ సినిమాలో కీలక పాత్ర కోసం వరలక్ష్మిని తీసుకుంటే, మరో సినిమాలో ఇంకో కీలక పాత్ర కోసం ఆమె తండ్రి శరత్ కుమార్ ను తీసుకున్నాడు.
ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న సినిమా వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈ కీలక పాత్రలో వరలక్ష్మి నటిస్తోంది. సినిమాలో ఆమె లేడీ విలన్ గా కనిపించనుందనే టాక్ నడుస్తోంది.
ఈ మూవీ తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు బాలకృష్ణ. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం శరత్ కుమార్ ను తీసుకున్నారు. ఇది నెగెటివ్ రోల్ అని తెలుస్తోంది.
ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో ఇటు వరలక్ష్మిని, అటు ఆమె తండ్రి శరత్ కుమార్ తో నటిస్తున్నాడు బాలకృష్ణ.
వీరసింహారెడ్డి సినిమా విడుదలకు సిద్ధమౌతోంది. ఇక అనీల్ రావిపూడి సినిమా విషయానికొస్తే, ఇటీవలే ఈ సినిమా షూటింగ్ భారీ యాక్షన్ బ్లాక్ తో గ్రాండ్ గా మొదలైంది. ఈ షెడ్యూల్ లో శరత్ కుమార్ కూడా నటిస్తున్నారు. శ్రీలీల ఇందులో బాలకృష్ణ కూతురిగా కనిపించనుంది.