జాతకాలు, సెంటిమెంట్స్ నమ్మేవాళ్లు నమ్ముతారు. తమకు ఏదైనా జరిగితే అది జాతక ప్రభావం అనుకుంటారు. ఇండస్ట్రీలో ఇలాంటి సెంటిమెంట్స్ కు పెట్టింది పేరు బాలకృష్ణ. ప్రతి పని ముహూర్తం చూసి చేయడం అలవాటు ఈ సీనియర్ హీరోకి.
సెంటిమెంట్ కు విరుద్ధంగా ఏ పనీ చేయరు. ఓసారి అలా చేసినందుకు నడుము విరిగిందని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటో తెలుసా.. ఆదివారం.. నలుపు రంగు.
“నాది మూల నక్షత్రం. ఆదివారం బ్లాక్ కలర్ వేయకూడదు. చాలా డేంజర్. ఏమౌతుందో చూద్దామని ఓసారి వేశాను. ఆదిత్య369 నిర్మాతల్లో ఒకరైన బాలసుబ్రమణ్యం గారు ఓసారి రాకరాక సినిమా షూటింగ్ కు వచ్చారు. ఆరోజు ఆదివారం. నేను కావాలని నలుపు రంగు షర్ట్ వేసుకొని వెళ్లాను. ఆదివారం వద్దని నా మైండ్ చెబుతూనే ఉంది, వినలేదు. బాలుగారి కళ్ల ముందే పడ్డాను, నా నడుము విరిగింది.”
జాతకానికి విరుద్ధంగా వెళ్లాను కాబట్టే ఆరోజు అలా అయిందంటున్నారు బాలకృష్ణ. ఈ సంగతి పక్కనపెడితే.. ఆదిత్య369 వచ్చి 35 ఏళ్లవుతోంది. అంటే, అప్పట్నుంచే బాలకృష్ణ ఈ జాతకాలు, శాస్త్రాలు, సెంటిమెంట్లు నమ్ముతున్నారన్నమాట. అప్పటికి ఆయనకు 30 ఏళ్లు.
2024… 175.. 11
ఆకాశం లో బటన్ పర్యటనలు.. భూమి మీద పరదాలు.. ట్రాఫిక్ బంద్‌లు
inka entha kalam raa babu veedi cinemalu
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు