అందరూ రావాలి..మీడియా తప్ప!

నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల సినిమా, సామాజిక, రాజ‌కీయ జీవిత ప్రస్థానం సందర్భంగా భారీ వేడుకను నిర్వహిస్తున్నారు తెలుగు సినిమా ఛాంబర్, కౌన్సిల్ అంతా కలిసి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు సెలబ్రిటీలు, మంత్రులు,…

నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల సినిమా, సామాజిక, రాజ‌కీయ జీవిత ప్రస్థానం సందర్భంగా భారీ వేడుకను నిర్వహిస్తున్నారు తెలుగు సినిమా ఛాంబర్, కౌన్సిల్ అంతా కలిసి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు సెలబ్రిటీలు, మంత్రులు, నటులు ఇలా ఎంతో మంది హాజ‌రవుతున్నారు ఈ పంక్షన్ కు. ఈ ఫంక్షన్ తలపెట్టినప్పటి నుంచి, ఇది మనందరి ఇంటి ఫంక్షన్. హేమా హేమీలు తరలి వస్తున్నారు. అంగరంగ వైభవంగా జ‌రిగే ఈ ఫంక్షన్ కు మీడియా కూడా సహకరించాలి అంటూ సినిమా రంగ పెద్దలు ప్రసన్నకుమార్, దామోదర్ ప్రసాద్ లాంటి వాళ్లు చెబుతూ వస్తున్నారు.

కర్టెన్ రైజ‌ర్ మీట్ అని, మరో మీట్ అని మీడియాను పిలిచి ఫంక్షన్ ఎంత భారీగా చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు అంటూ చెబుతూ వచ్చారు. అలాగే సెలబ్రిటీలను పిలిచినపుడల్లా కంటెంట్ ను మీడియా కవరేజ్ కు విడుదల చేస్తూ వస్తున్నారు. మీడియా కూడా సహకరిస్తూ వచ్చింది.

ఇప్పుడు ఈవెంట్ గంటల్లో వచ్చింది. ఇప్పటి వరకు మీడియాకు అహ్వానం లేదు. ఈవెంట్ పీఆర్ వ్యవహారాలు చూసే మధును ఈ విషయమై ప్రశ్నించగా, మీడియా కవరేజీకి ఆహ్వానం లేదని, కావాలంటే ఫ్యామిలీలతో చూడడానికి రావచ్చు అని అన్నారు. మరి పాస్ ల సంగతేమిటి అంటే, నిర్వాహకులు శ్రేయా శ్రీనివాస్ ను పాస్ లు అడిగామని కానీ ఇప్పటి వరకు రాలేదని అన్నారు.

ఇదే విషయమై నిర్వాహకులు శ్రేయా శ్రీనివాస్ ను ప్రశ్నించగా, ఇది తమ సంస్థ చేసుకుంటున్న క్లోజ్డ్ డోర్ ఫంక్షన్ అని అన్నారు. మరి ఇన్నాళ్లు మీడియాను ఎందుకు పిలిచారు, అప్ డేట్ లు ఇచ్చారు.. మీ అన్ రికార్డ్ కోట్ ఇవ్వండి అని అడగ్గా, ఫ్యామిలీలను తీసుకుని మీడియా రావచ్చుని, పాస్ లు రెడీగా వున్నాయని అన్నారు. మరి ఇఫ్పటి వరకు మీడియాకు సమాచారం లేదు కదా అంటే ఇప్పుడు ఇస్తామన్నారు.

కౌన్సిల్, చాంబర్ పెద్దలు ప్రసన్న, దామోదర ప్రసాద్ లను సంప్రదించడానికి ప్రయత్నించినా ఫోన్ కు అన్సర్ రాలేదు.

అందరం కలిసి సెల్రబేట్ చేసుకునే తరుణం అని చెప్పి, మీడియా సహకరించాలని పదే పదే చెప్పి ఇప్పుడు దూరం పెట్టడం ఏమిటో?

10 Replies to “అందరూ రావాలి..మీడియా తప్ప!”

  1. ఏలిన నాటి శని 7.5 yeయర్స్య లో పోతుంది. ఏభై ఏళ్ల గ్రహణం ఇంకా వీడలేదు. AP గ్రహచారం.

  2. నీకు బాలయ్య బాబు అంటే ఎంత కుల్లో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.

  3. “cameraman ganaga tho Rambabu ” లో ఒక scene lo prakashraj చెప్తారు. మీ మీడియా వాలు “item” గాలని. Adhi బాలయ్య 💯correct గా గెస్ చేశారు. పిలవని పేరంటానికి వెళ్ళాలని ఎందుకు ఏడుస్తారు

  4. నీలాంటి గలీజ్ గాళ్ళు ఎందుకు లే అనేమో పిలవలేదు…శుభమా అని వాళ్ళు ఏమైనా చేసుకుంటే నీలాంటి కొందరు బ్రస్టులు దరిద్రులు నీచులు ఎందుకు లే అని అనుకున్నారేమో 😀😀 ఇలాంటి చండాలపు వార్తలు నువ్వెన్ని రాసుకున్నా బాలయ్య కింద ఆతు కూడా ఊడదు రా ఎర్రి ఎంగలప్ప

Comments are closed.