శనివారంతో సరిపోయింది

ఏ ముహూర్తాన సరిపోదా శనివారం అని టైటిల్ పెట్టారో కానీ.. నాని నటించిన ఈ సినిమా శనివారంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిజానికి శనివారం కూడా ఈ సినిమాపై వర్షాలు ప్రభావం చూపించాయి. కానీ ఆక్యుపెన్సీ…

ఏ ముహూర్తాన సరిపోదా శనివారం అని టైటిల్ పెట్టారో కానీ.. నాని నటించిన ఈ సినిమా శనివారంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిజానికి శనివారం కూడా ఈ సినిమాపై వర్షాలు ప్రభావం చూపించాయి. కానీ ఆక్యుపెన్సీ ఉన్నంతలో కాస్త మెరుగ్గానే ఉంది. ఈరోజు సినిమా పుంజుకుంటుందని భావించిన మేకర్స్ కు వర్షాలు ఊహించని దెబ్బకొట్టాయి.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. బెజవాడలో కనీవినీ ఎరుగని వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఇదే పరిస్థితి. ఇటు తెలంగాణలో కూడా సేమ్ టు సేమ్. హైదరాబాద్ సిటీతో పాటు, దాదాపు 10 జిల్లాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి.

దీంతో సరిపోదా శనివారం సినిమాకు ప్రేక్షకుల రాక తగ్గింది. ఊహించినదానికంటే ఆక్యుపెన్సీ తగ్గింది. నిజానికి ఏపీలో వర్షాలుంటే, తెలంగాణలో కాస్త తెరిపిస్తుంది. తెలంగాణలో వర్షాలుంటే ఏపీలో వాతావరణం మెరుగ్గా ఉంటుంది. కానీ, ఈసారి రెండు రాష్ట్రాల్లో ఏకధాటిగా వానలు పడుతున్నాయి. నాని సినిమాకు ఇది ఊహించని దెబ్బ.

ఎంత పెద్ద సినిమాకైనా సోమవారం నుంచి వసూళ్లు తగ్గుతాయి. మొదటి వారాంతంలోనే మ్యాగ్జిమమ్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. ఈ విషయంలో నానికి శనివారం, ఆదివారం కలిసిరాలేదనే చెప్పాలి.

ఓవర్సీస్ మినహాయిస్తే, ఈ సినిమాకు దాదాపు 90 శాతం వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. తమిళ్ నుంచి మంచి వసూళ్లు వస్తున్నాయని మేకర్స్ ప్రకటించుకున్నప్పటికీ, అది చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఇక మలయాళం, హిందీ వెర్షన్లను తామే లైట్ తీసుకున్నామని స్వయంగా నాని ప్రకటించాడు.

4 Replies to “శనివారంతో సరిపోయింది”

Comments are closed.