తెలుగులో చాలా టాక్ షో లు వచ్చాయి. హిట్ లు వున్నాయి..ఫ్లాపులు వున్నాయి. యాంకర్ ప్రదీప్ కొంచెం టచ్ లో వుంటే చెబుతా, ఆలీతో సరదాగా, రానా చాట్ షో ఇలా చాలా వున్నాయి. ఇవన్నీ పాపులర్ నే. అయితే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోలేదు. సమంత చేసిన టాక్ షో కూడా పెద్దగా క్లిక్ కాలేదు.
కానీ తొలిసారిగా హీరో బాలకృష్ణ చేసిన టాక్ షో మాత్రం సూపర్ డూపర్ హిట్ అనిపించేసుకుంది. బ్యాక్ ఎండ్ లో వర్క్ చేసిన టీమ్ కష్టం వుండనే వుంటుంది అందులో సందేహం లేదు. కానీ బాలయ్య వర్క్ కూడా వుంది.
అస్సలు ఇగో అన్నది లేకుండా కిందకు దిగిపోయి షో చేయడం, మధ్యమద్యలో చమక్కులు యాడ్ చేయడం ఇలా అన్ని విధాలా షోను రక్తి కట్టించి, ఆహా సంస్థ రెండో సీజన్ ను స్టార్ట్ చేయడానికి ఆలోచించేలా చేసారు.
తొలిసీజన్ కు బాలయ్యకు వచ్చిన రెమ్యూనిరేషన్ జస్ట్ 25 లక్షలు మాత్రమే. ఎపిసోడ్ కు 25 లక్షలు వంతును టోటల్ సీజన్ కు రెండున్నర కోట్లు అన్నమాట. అయితే షో ఇంత బ్లాక్ బస్టర్ అయింది కనుక రెండో సీజన్ కు డబుల్ అవుతుందేమో?
విశేషం ఏమిటంటే అన్ స్టాపబుల్ కార్యక్రమానికి క్రియేటివ్ కన్సల్టెంట్ గా బాలయ్య రెండో కుమార్తె ఎమ్ తేజస్విని పేరు వేయడం. బాలయ్య కుమార్తె సినిమాలకు సంబంధించిన ఓ పనిలోకి ప్రవేశించడం ఇదే ప్రధమం అనుకోవాలి.