నిన్న మొన్నటి వరకు సినిమా ఫంక్షన్ లు అంటే గెస్ట్ ఎవరు అనే పాయింట్ వస్తే నిర్మాతలు, హీరోల చూపు మెగాస్టార్ వైపు మాత్రమే వుండేది. అలాగే కొన్నిసార్లు పవన్ కళ్యాణ్. కానీ గమ్మత్తేమిటంటే సోషల్ మీడియాలో మాత్రం ట్రోలింగ్ లు మామూలుగా వుండేవి కాదు. సినిమా ఏమాత్రం తేడా కొట్టినా అదంతా మెగా హీరోల ఖాతాలోకి పోయేది.
ఇప్పుడు లేటెస్ట్ గా నందమూరి ట్రెండ్ మొదలైంది. నందమూరి బాలకృష్ణ తొలిసారి ఓ చిన్న సినిమా ఫంక్షన్ కు హాజరయ్యారు. ఊర్వశి..రాక్షసి సినిమా ఫంక్షన్ కు గెస్ట్ గా వచ్చారు. ఆ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఓకె ఫరవాలేదు అనిపించుకుంది. ఇప్పుడు మళ్లీ మరో సినిమా ఢమ్కీ ఫంక్షన్ కు నందమూరి బాలకృష్ణ గెస్ట్ గా వచ్చారు.
ఇప్పటి నుంచే నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ హడావుడి మొదలైపోయింది. నందమూరిది గోల్డెన్ లెగ్ అని, సినిమా హిట్ అని సోషల్ మీడియాలో మొదలుపెట్టేసారు. ఢమ్కీ సినిమా మీద పాజిటివ్ ట్రెండ్ ప్రచారానికి నందమూరి ఫ్యాన్స్ శ్రీకారం చుట్టేసారు.
నీ ఇంట్లో నా ఇంజన్
ఢంమ్కీ ట్రయిలర్ లాంచ్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ సినిమాలో డైలాగ్ అయిన ‘నీ ఇంట్లో నా ఇంజన్’ డైలాగులో హడావుడి చేసారు. విష్వక్ కూడా తనలాగే పెద్ద పొడికి అనే మాట వేసారు. గెట్ ఆఫ్ మై కార్, మెడికల్ షాప్ దగ్గర ఆపనా లాంటి డబుల్ మీనింగ్ డైలాగులు కోట్ చేసారు.
తన చేతికి చాలా ఉంగరాలు వుంటాయని, అలా వుండడం వల్ల గోవాలో ఎవరి చేతికి ఎక్కువ ఉంగరాలు వుంటాయనే కాంటెస్ట్ లో తను ప్రయిజ్ గెలుచుకున్నానని బాలయ్య చెప్పారు. బాలయ్య తన స్పీచ్ ను వీలయినంత వరకు తెలంగాణ స్లాంట్ ను యాడ్ చేసి ప్రసంగిండం విశేషం.