మాజీ సిఎమ్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు Hansen's disease వ్యాధితో బాధపడుతున్నారంటూ ఓ ట్వీట్ వేసారు ఎంపీ, వైకాపా నేత విజయసాయి రెడ్డి. ఈ వ్యాధితో చంద్రబాబు కాళ్ల వేళ్లు ఆరు పూర్తిగా పాడయిపోయాయని విజయసాయి పేర్కొన్నారు. ప్రతి ఆరు గంటలకు ఓ సారి సాక్స్ లు మార్చాలని, ఈ వ్యాధి కారణంగానే చంద్రబాబు ఎక్కడా బూట్లు విప్పరని విజయసాయి వివరించారు.
నిజానికి ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. HANSENS DISEASE అంటే దాదాపు లెప్రసీ వ్యాధి లాంటిది. చాలా వరకు అంతరించిపోయిన వ్యాధి ఇది. ఈ వ్యాధి ఒకసారి సోకితే శరీరంలోని పలు భాగాలకు సోకే ప్రమాదం వుంది. మరి ఏ విధమైన సమాచారంతో విజయసాయి ఈ ట్వీట్ వేసారు అన్నది ఒక పాయింట్. నిజంగా ఇలాంటి వ్యాధితో బాధపడుతుంటే చంద్రబాబుకు ఇంకా రాజకీయాలు అవసరమా? ముందుగా ఆరోగ్యం చక్కదిద్దుకోకుండా అన్నది మరో పాయింట్.
లోకేష్ మీద కూడా
బిలోది బెల్ట్ అన్నట్లుగా విజయసాయి మరో ట్వీట్ ను లోకేష్ మీద వేసారు.
‘’ఎవరో విసిరిన విత్తనం, ఎక్కడో మొలకెత్తింది. ఇంకెవరో నీళ్లు పోశారు!’’ అంటూ విజయసాయి లోకేష్ మీద ట్వీట్ వేయడం చాలా దారుణమే. ఎవరో విత్తనం వేయడం, ఎక్కడో మొలకెత్తడం అంటూ ద్వందార్ధాలు వేయడం కచ్చితంగా బిలో ది బెల్ట్ అటాక్ చేయడమే.