బాలయ్య ..ఆఫ్టర్ అఖండ

ఎన్ని సినిమాలు ఫ్లాపు అయ్యయి అన్నది కాదు క్వశ్చను…ఒక్క సినిమా హిట్ అయ్యిందా లేదా అన్న పాయింట్. తెలుగు సినిమాల హీరోలకు ఇదే సూత్రం. ఒక్క సినిమా హిట్ అయితే చాలు, పారితోషికం పెరిగిపోతుంది. …

ఎన్ని సినిమాలు ఫ్లాపు అయ్యయి అన్నది కాదు క్వశ్చను…ఒక్క సినిమా హిట్ అయ్యిందా లేదా అన్న పాయింట్. తెలుగు సినిమాల హీరోలకు ఇదే సూత్రం. ఒక్క సినిమా హిట్ అయితే చాలు, పారితోషికం పెరిగిపోతుంది. 

టాలీవుడ్ లో రీజనబుల్ పారితోషికం తీసుకునే హీరో బాలకృష్ణ. అఖండ ముందు జస్ట్ ఎనిమిది కోట్ల నుంచి పది కోట్లు మాత్రమే ఆయన పారితోషికం. కానీ అఖండ హిట్ అయిన తరువాత ఆయన పారితోషికం కూడా అలా అలా పెరుగుతోందని బోగట్టా.

మైత్రీ మూవీస్ లో చేస్తున్న జైబాలయ్య సినిమాకు ముందుగా పది కోట్లు అనుకున్నారు. కానీ ఇంకా ఫైనల్ చేయలేదు. సినిమా పూర్తయ్యాక మార్కెట్ చేసే ముందు డిస్కషన్ చేసి సెటిల్ చేసుకుంటారు. అంటే ఎలా లేదన్నా 12 కోట్లు వుంటుందని టాక్. 

ఆ తరువాత చేయబోయే సినిమా అనిల్ రావిపూడిది. ఈ సినిమాకు మరి ఎంత కోట్ చేస్తారో ఇంకా తెలియదు. ఎలా లేదన్నా 15 కోట్ల వరకు వుంటుందని తెలుస్తోంది.

టాలీవుడ్ లో పారితోషికాలు సినిమా సినిమాకు పెరుగుతున్నాయి. యంగ్ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోలకు ఎనిమిద కోట్ల నుంచి 70 కోట్ల వరకు పలుకుతున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే బాలయ్య రీజన్ బుల్ గానే చార్జి చేస్తున్నారేమో? కానీ ఇక్కడ ఒక పాయింట్ వుంది. బోయపాటితో తప్పిస్తే బాలయ్యకు హిట్ లు లేవన్నది.