కేవలం యాక్షన్ అంటే ఏముంటుంది. హీరో బలంగా కొట్టాలంటే అంతకన్నా బలమైన కారణం వుండాలి. అంత బలమైన కారణం వుండాలి అంటే అంతకన్నా బలమైన కథ వుండాలి. విడుదలైన రామారావ్ ఆన్ డ్యూటీ ట్రయిలర్ చూస్తే అదే అనిపిస్తుంది.
ఓ థ్రిలర్ టచ్ తో మాస్ కథ చెప్పే ప్రయత్నం చేస్తూ దానికి బలమైన యాక్షన్ ను జోడించడం అంటే మామూలు ఫీట్ కాదు. అలాంటి ఫీట్ ను చేసాడు దర్శకుడు శరత్ మండవ.
రవితేజ లాంటి హీరోను తీసుకున్నాక మాస్, యాక్షన్ ఇవన్నీ కామన్. కానీ అవి మాత్రమే చేస్తే రొటీన్ కథ అయిపోతుంది. అందుకే కావచ్చు. ఓ మిస్సింగ్ కేసుల థ్రిల్లర్ జానర్ ను యాడ్ చేసారు. సాధారణంగా రవితేజ సినిమాల్లో బలమైన పంచ్ డైలాగులు వుంటాయి. కానీ ట్రయిలర్ లో డైలాగులు పెద్దగా లేవు కానీ డిఫరెంట్ థ్రిల్లింగ్ పాయింట్లు, యాక్షన్ సీన్లు గట్టిగా జోడంచారు.
యాక్షన్ సీన్లు, థ్రిల్లింగ్ ఇన్విస్టిగేషన్ సీన్లు కొత్తగా వున్నాయి. సినిమాలో కథ ఏదో గట్టిగా వుందన్న ఫీలింగ్ ను ట్రయిలర్ కలిగించింది. సామ్ సిఎస్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ బాగుంది. సుధాకర్ చెరుకూరి నిర్మాణ విలువలు బాగున్నాయి. హీరోయిన్లకు సినిమాలో పెద్దగా స్కోప్ వున్నట్లు ట్రయిలర్ లో అయితే తెలియలేదు.