Advertisement

Advertisement


Home > Movies - Movie News

బాలయ్య-అనిల్ రావిపూడి..అక్టోబర్ 21 ?

బాలయ్య-అనిల్ రావిపూడి..అక్టోబర్ 21 ?

మే నుంచి అక్టోబర్ వరకు సినిమాల విడుదల డేట్ లు బ్లాక్ అయిపోతున్నాయి. దసరా టైమ్ లో విడుదలకు ఇప్టటికే రామ్-బోయపాటి సినిమా డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ టైమ్ లో వస్తుందనుకున్న బాలయ్య-అనిల్ రావిపూడి సినిమా డేట్ మీద అనుమానాలు ముసురుకున్నాయి. 

విశ్వసనీయ వర్గాల ప్రకారం బాలయ్య 108 వ సినిమా విడుదలకు అక్టోబర్ 21 వ తేదీని విడుదల డేట్ గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రాధమికంగా ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

21 శనివారం వచ్చింది. ఆ మర్నాటి నుంచీ అన్నీ వరుస పండగ సెలవులే. అందువల్ల ముందు రోజు బోయపాటి సినిమా విడుదలైనా సమస్య కాదని భావిస్తున్నారు. బాలయ్య-అనిల్ రావిపూడి సినిమాలో కాజల్, శ్రీలీల, జగపతిబాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు సాహు గారపాటి నిర్మాత.

ఇదిలా వుంటే ఇదే దసరా కు మరో ఒకటి రెండు సినిమాలు కూడా ప్లాన్ చేస్తున్నారు. అందువల్ల మొత్తం మీద దసరా సీజన్ కు కాస్త గటి పోటీ వుండే అవకాశం కనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?