ఏ అవకాశాన్ని అయినా అందిపుచ్చుకుని తనకు అనుగుణంగా వాడుకోవడంలో చంద్రబాబు నాయుడు ను మించిన వారు లేరు. ఆహా సంస్థ అన్ స్టాపబుల్ 2 షో ను కూడా బాబుగారు తనకు అనుకూలంగా మార్చేసుకున్నారు. జనాలకు తన మీద వున్న అనుమానాలు కావచ్చు…తను వివరించాల్సి చెప్పాలనుకున్న సంగతులు కావచ్చు..అలాగే…లోకేష్ విషయంలో వున్న వార్తలు అన్నింటికి సమాధానం ఇవ్వడానికి అన్ స్టాపబుల్ షో ను అకేషన్ గా చేసుకున్నారు.
‘’ ఎన్టీఆర్ ను కాళ్లు పట్టుకుని బతిమిలాడా…వినలేదు..’ అంటూ 1995 ఆగస్టు సంక్షోభం గురించి చెప్పుకొచ్చారు. ఇప్పటికి ఎన్టీఆర్ నే తన ఆరాధ్య దైవం అని తన గుండెల్లో వున్నారని చాటుకున్నారు.
రాజశేఖర్ రెడ్డి తన ప్రియతమ మిత్రుడని అటో రాయి వేసారు. అమ్మాయిలను చూస్తే సైలెన్సర్ లు తీసేసి తిరిగేవాడినని, బాలయ్య సినిమాల్లో చేసినవన్నీ తను నిజజీవితంలో చేసేసానని హీరోయిజం వెల్లడించారు.
లోకేష్ విదేశీ విలాసాల ఫొటో చూపించి దీని వైనం ఏమిటంటే…’బ్రాహ్మణికి లేని బాధ జనాలకు ఎందుకు’ అనే మీనింగ్ వచ్చేలా సమాధానం ఇచ్చారు. మంగళగిరి లో ఓడిపోవడం మీద కూడా లోకేష్ తో ఓ చిన్న వివరణ ఇప్పించేసారు పనిలో పనిగా.
ఇవన్నీ చాలక మరోసారి బాబుగారి విజన్..సైబరాబాద్ అంటూ అటు కూడా ఓ మాట పడేసారు పడివుంటుందని. మొత్తానికి ఇటు ఫ్యామిలీ అటు రాజకీయాలు కలిపి కొట్టినట్లుంది స్క్రిప్ట్.