తమిళ సినిమా ఆధారంగా తెలుగులో నిర్మిస్తున్న సినిమా డేగల బాబ్జీ. నిర్మాత, నటుడు బండ్ల గణేష్ చాలా కాలం తరువాత నటించిన సినిమా. తమిళంలో పార్తీపన్, హిందీలో అభిషేక్ నటించిన పాత్రను తెలుగులో బండ్ల గణేష్ చేస్తున్నాడు. ఓటిటి కోసం ఈ సినిమాను నిర్మించారు.
కేవలం ఒకే ఒక్క పాత్రతో ఈ సినిమా మొత్తం నడుస్తుంది. వేరే పాత్రల స్వరాలు వినిపిస్తాయి కానీ ఫేస్ లు కనిపించవు. డేగల బాబ్జీ ట్రయిలర్ అదే చెబుతోంది. ట్రయిలర్ మొత్తం బండ్ల గణేష్ ఏకపాత్రాభినయమే. నాటకాల్లో మాదిరిగా ఏకపాత్రాభినయం అన్నమాట.
నవరసాలు వొలికిస్తూ అల్లుకున్న అనేకానేక సీన్లు ట్రయిలర్ లో పేర్చారు. వాటిల్లో బండ్ల హావ భావాలు ఓ రేంజ్ లో వున్నాయి. పార్తీపన్, అభిషేక్ లు ఈ పాత్రల్లో నటించి పేరు తెచ్చుకున్నారు.
సోషల్ మీడియాలో విపరీతంగా నోట్ అయిపోయిన ఫేస్, కమెడియన్ గా జనాలకు గుర్తుండిపోయిన ఫేస్ అయిన బండ్ల ను జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.