రెండో రోజు కూడా కొనసాగుతున్న గురూజీ ఎపిసోడ్

టాలీవుడ్ లో గురూజీ రచ్చ వరుసగా రెండో రోజు కొనసాగుతోంది. ఇప్పటికే గురూజీ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేశ్, ఈరోజు కూడా అదే పేరిట మరికొన్ని కామెంట్స్ చేశాడు. Advertisement –…

టాలీవుడ్ లో గురూజీ రచ్చ వరుసగా రెండో రోజు కొనసాగుతోంది. ఇప్పటికే గురూజీ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేశ్, ఈరోజు కూడా అదే పేరిట మరికొన్ని కామెంట్స్ చేశాడు.

– భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి, భగవంతుడికి భక్తుడిని దూరం చేసేది గురూజీ దర్బార్ సుత్తి

– సాగినంత కాలం నా అంత వాడు లేడందురు, సాగకపోతే ఊరక చతికిల పడిపోవదురు, చెప్పడమే నా ధర్మం..వినకపోతే నీ ఖర్మం

ఇలా కొన్ని ట్వీట్లు వేశాడు బండ్ల గణేశ్. దీనిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. భగవంతుడు అంటే పవన్ కల్యాణ్ అని, భక్తుడు అంటే బండ్ల గణేశ్ అని, గురూజీ అంటే త్రివిక్రమ్ అంటూ డీకోడ్ చేసుకుంటున్నారు నెటిజన్లు. పవన్ తో సినిమా చేయనీయకుండా త్రివిక్రమే, బండ్ల గణేష్ ను అడ్డుకుంటున్నాడని, ఆ కోపంతోనే బండ్ల ఇలా చేస్తున్నాడనే వాదన కూడా వినిపిస్తోంది.

నిన్నటికినిన్న 'గురూజీ' పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు బండ్ల. భార్యాభర్తల్ని, గురుశిష్యుల్ని, తండ్రికొడుకుల్ని వేరుచేయడం గురూజీ స్పెషలిటీ అంటూ ట్వీట్ చేశాడు. అదే టైమ్ లో గురూజీకి కాస్ట్ లీ గిఫ్టుల పిచ్చి ఉందని కూడా వెల్లడించాడు. ఈరోజు ఇలా అగరుబత్తి కాన్సెప్ట్ తో తెరపైకొచ్చాడు.

అయితే ఈ ట్వీట్ల వివాదం ఎలా కొలిక్కి వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరం. తనకు ఏదో ఒక సమాధానం దొరికేవరకు బండ్ల ఆగడు. ఇలాంటి వాటిపై 'గురూజీ' స్పందించడు. అటు 'భగవంతుడు' ఇలాంటివి చూసి నవ్వుకుంటాడు తప్ప ఎలాంటి రియాక్షన్ ఇవ్వడు. సో.. ఈ వివాదానికి ఎవరు, ఎలా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి.