బండ్ల..మళ్లీ మేకప్

కామెడీ పాత్రల నుంచి నిర్మాతగా ప్రమోషన్ తీసుకున్నాక, యాక్టింగ్ ను పక్కన పెట్టాడు బండ్ల గణేష్. అలా హ్యాపీగా పక్కన వున్న బండ్లను బలవంతంగా ఒప్పించి మరీ ' సరిలేరు నీకెవ్వరు' సినిమాలో  కనిపించేలా…

కామెడీ పాత్రల నుంచి నిర్మాతగా ప్రమోషన్ తీసుకున్నాక, యాక్టింగ్ ను పక్కన పెట్టాడు బండ్ల గణేష్. అలా హ్యాపీగా పక్కన వున్న బండ్లను బలవంతంగా ఒప్పించి మరీ ' సరిలేరు నీకెవ్వరు' సినిమాలో  కనిపించేలా చేసాడు అనిల్ రావిపూడి. 

కామెడీ సినిమాల్లో అనిల్ మీద వున్న నమ్మకంతో ఒప్పుకుని, అభాసుపాలయ్యాడు బండ్ల. నిజానికి అదే టైమ్ లో మారుతి డైరక్షన్ లో ప్రతిరోజూ పండగే సినిమా లో కూడా నటించాల్సింది. కానీ ఎందుకో మంచి చాన్స్ మిస్ చేసుకున్నాడు. 

సరిలేరు నీకెవ్వరు దెబ్బకు మరి నటించను అని డిసైడ్ అయిపోయాడు. కానీ ఇప్పుడు మారుతి డైరక్షన్ లో మిస్ అయిన చాన్స్ ను మరోసారి టేకప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ హీరోగా మారుతి చేయబోతే 'పక్కా కమర్షియల్' (టైటిలే అది) సినిమాలో ఓ మాంచి ఫన్ క్యారెక్టర్ ను చేయబోతున్నట్లు తెలుస్తోంది.  

కామెడీ పాత్రల విషయంలో మారుతి ఫెయిల్ అయింది చాలా తక్కువ. అందువల్ల ఈ సినిమాతో బండ్ల యాక్టింగ్ కెరీర్ ముందుకు వెళ్తుందనే అనుకోవాలి. 

కళ్యాణ్ గారితో నన్ను పోల్చొద్దు

మరో ‘రంగస్థలం’ అవుతుంది