అసలు ఈ సంక్రాంతికి రావాలా?వద్దా? అనే సందేహంలో వుండిపోయింది నాగ్-చైతన్య ల మల్టీ స్టారర్ బంగార్రాజు. అటు ఆర్ఆర్ఆర్, ఇటు రాధేశ్యామ్. అందుకే ఆ సందేహం.
వాస్తవానికి ఈ ప్రాజెక్టు ను కచ్చితంగా సంక్రాంతి బరిలోకి దింపాలనే అగ్రిమెంట్ తోనే మొదలు పెట్టారు. కానీ పరిస్థితులు అలా వచ్చాయి. దాంతో రేటు కూడా పెద్దగా పలకడం కష్టం అవుతుంది అనుకున్నారు. ఆంధ్ర మహా అయితే 12 కోట్ల రేషియో లో రేటు వుండొచ్చు అనుకున్నారు.
కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అసలు సిసలు సినిమాలు అన్నీ వాయిదా పడ్డాయి. పడబోతున్నాయి. ఇక సంక్రాంతికి ఎన్ని సినిమాలు వున్నా బంగార్రాజే కింగ్. అందుకే రేటు కూడా మారిపోయినట్లు తెలుస్తోంది. ఆంధ్ర ఒక్కటే 18 కోట్ల రేషియో చెబుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.
45 కోట్లకు జీ టీవీ కి అన్ని హక్కులతో వచ్చిన సినిమా ఇది. ఆంధ్ర 18 కోట్లు చెబుతున్నారు అంటే టోటల్ థియేటర్ రైట్స్ మీదే ఓ నలభై దాకా లాగేయాలని డిసైడ్ అయిపోయినట్లు కనిపిస్తోంది.