రామ్ చేతిలో బేస్ బాల్ స్టిక్.. సింక్ అయిందా?

రామ్, బోయపాటి కలిసి సినిమా చేస్తున్నారు. మూవీకి సంబంధించి ఆల్రెడీ ఓ లుక్ రిలీజ్ చేశారు. రిలీజ్ డేట్ ప్రకటించే సందర్భంగా గంగిరెద్దును తీసుకొస్తున్న రామ్ స్టిల్ ను విడుదలచేశారు. ఇప్పుడు ఫస్ట్ థండర్…

రామ్, బోయపాటి కలిసి సినిమా చేస్తున్నారు. మూవీకి సంబంధించి ఆల్రెడీ ఓ లుక్ రిలీజ్ చేశారు. రిలీజ్ డేట్ ప్రకటించే సందర్భంగా గంగిరెద్దును తీసుకొస్తున్న రామ్ స్టిల్ ను విడుదలచేశారు. ఇప్పుడు ఫస్ట్ థండర్ (ఫస్ట్ గ్లింప్స్ అనుకోవచ్చు) రిలీజ్ సందర్భంగా మరో లుక్ రిలీజ్ చేశారు.

ఈసారి కూడా గంగిరెద్దు బ్యాక్ డ్రాప్ లోనే రామ్ ను ఫుల్ ప్రొఫైల్ లో ప్రజెంట్ చేశారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన 2 స్టిల్స్, ఒకే సీన్ కు సంబంధించినవనే విషయం అర్థమౌతూనే ఉంది. ఉన్నంతలో తేడా ఏంటంటే.. రామ్ చేతికి బేస్ బాల్ స్టిక్ అందించాడు దర్శకుడు బోయపాటి శ్రీను.

బోయపాటి శ్రీను సినిమాల్లో హీరోలంతా రకరకాల వెపన్స్ పట్టుకుంటారు. అఖండలో బాలయ్యకు ఏకంగా త్రిశూలం అందించాడు బోయపాటి. మరి రామ్ లాంటి కుర్రహీరోకు గొడ్డలి, త్రిశూలం లాంటి ఆయుధాలు బాగుంటాయా? అందుకేనేమో ఇలా బేస్ బాల్ స్టిక్ అందించాడు. కానీ అది కాస్తా మిస్-మ్యాచ్ అనిపిస్తోంది.

క్రికెట్ బ్యాట్ పట్టుకోవచ్చు, హ్యాకీ స్టిక్ పట్టుకోవచ్చు, కానీ బేస్ బాల్ స్టిక్ అనేది పూర్తిగా మన జనాలకు కొత్త. ఆ మాటకొస్తే ఇండియాలో బేస్ బాల్ ఎవ్వరూ ఆడరు. ఇంతకుముందు కొన్ని సినిమాల్లోని ఫైట్స్ లో ఈ బేస్ బాల్ స్టిక్ ను బాగానే వాడారు కొంతమంది మేకర్స్. కాకపోతే రూరల్ బ్యాక్ డ్రాప్ లో, పక్కా మాస్-యాక్షన్ మూవీగా వస్తున్న ఈ సినిమాలోకి బేస్ బాల్ స్టిక్ ఎలా వచ్చిందనేది అనుమానం.

15వ తేదీన ఈ సినిమా నుంచి ప్రమోషనల్ మెటీరియల్ రాబోతోంది. బహుశా, ఆరోజు దీనిపై చిన్నపాటి క్లారిటీ వస్తుందేమో. ఈ సంగతి పక్కనపెడితే.. తాజాగా రిలీజ్ చేసిన స్టిల్ లో గుబురు గడ్డం, దట్టమైన మీసాలతో పక్కా మాస్ లుక్ లో, సిసలైన బోయపాటి హీరోగా మారిపోయాడు రామ్. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను దసరాకు విడుదల చేస్తారు.