రామ్ గోపాల్ వర్మ ఎందుకు సినిమాలు చేస్తున్నారు అంటే.. ఆయన ఆ ప్రశ్నకు ఏదో వెటకారంగా సమాధానం చెబుతారు. ఆ వెటకారంలో ఉన్నంత మజా కూడా ఆయన సినిమాల్లో ఉండటం లేదు. ఒకదాని తర్వాత మరొటిగా వర్మ సినిమాలు తీయడం.. అవి అలా వచ్చి, ఇలా వెళ్లిపోవడం జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ మరో సినిమాను వదులుతున్నారు.
ఇది కూడా వాస్తవ కథేనట. వాస్తవాలకు కల్పితాలు జోడించినట్టుగా చెప్పడం, కల్పితాలను వాస్తవాలు అనడం.. వర్మ సినిమా మార్కెటింగ్ టెక్నిక్ అయిపోయింది. ఈ నేపథ్యంలో 'బ్యూటిఫుల్' పేరుతో వర్మ మరో సినిమాను వదులుతున్నాడు. జనవరి ఒకటో తేదీన వర్మ ఈ సినిమాను విడుదల చేస్తారట. ఇలా న్యూ ఇయర్ మొదటి రోజే వర్మ మొదలుపెట్టేస్తున్నారు.
ఈ సినిమాకు 'ట్రిబ్యుట్ టు రంగీలా' అనేది ఉపశీర్షిక. ఇలా రంగీలాను కూడా వర్మ మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా వాడుతూ ఉన్నారు. ఇప్పటికే.. వర్మ తన పాత సినిమాల పేర్లన్నింటితోనూ మార్కెటింగ్ చేశారు. బహుశా రంగీలా మాత్రమే మిగిలింది.
దాన్ని కూడా ఈ సినిమా కోసం వాడేశారు. ఈ బ్యూటిఫుల్ ఎంత అగ్లీగా ఉంటుందో మాత్రమే విడుదల తర్వాత తేలాల్సిన అంశం.. అని వర్మ వీరాభిమానులు అంటున్నారు!