కొందరు ఇన్‌స్టంట్‌గా సమాధానాలు ఇవ్వడంలో దిట్టలుంటారు. అలాంటి వారిలో రొమేనియన్ బ్యూటీ లులియా వాంటూర్ ఒకరు. తాజాగా నెటిజన్ల ప్రశ్నకు ఇచ్చిన సమాధానం…అచ్చం అమెలాగే ఎంతో బ్యూటీగా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. లులియా , సల్మాన్‌ఖాన్ మంచి స్నేహితులు.
అప్పుడప్పుడూ ఆమె సరదాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. తాజాగా లులియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా నెటిజన్లు సరదాగా ఆమెను ఇరుకున పెట్టే ప్రశ్న సంధించారు.
సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, అర్బాజ్ ఖాన్ (సోదరులు) ఎవరంటే ఇష్టమని ఓ అభిమాని అడిగాడు. దీనికి లులియా ఏ మాత్రం తడుముకోకుండా సమాధానమిచ్చి…తానెంత తెలివిగల వ్యక్తో నిరూపించుకున్నారు. ఇంతకూ ఆమె ఏం చెప్పారంటే…తనకు ఖాన్ అంటే ఇష్టమని సమాధానమిచ్చారు. లులియా ఆన్సర్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఓహ్..మీరే కాదు…మీ ఆన్సర్ కూడా మీలా ఎంతో బ్యూటీ అంటూ నెటిజన్లు, అభిమానులు కామెంట్స్ పెట్టారు.
ఖాన్ అని చెప్పడం ద్వారా ముగ్గురిలో కామన్‌గా ఉన్న పదాన్ని ఎంచుకుని, అందరూ ఇష్టమని చెప్పినట్టైంది. లులియాలో ఇంత క్రియేటివిటీ ఉందా అంటూ పలువురు కామెంట్స్ పెట్టడం విశేషం. క్రియేటివిటీ ఏ ఒక్కరి సొత్తు కాదు కదా!