అర్ర‌ర్రె…క‌న్నా బాధ అదా?

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కన్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఇటీవ‌ల కాలంలో లేఖ‌లు రాయ‌డం బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏ విష యాన్నైనా సీఎం దృష్టికి తీసుకెళ్లాలంటే లేఖ ఒక్క‌టే ఏకైక మార్గ‌మ‌ని ఆయ‌న బ‌లంగా…

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కన్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఇటీవ‌ల కాలంలో లేఖ‌లు రాయ‌డం బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏ విష యాన్నైనా సీఎం దృష్టికి తీసుకెళ్లాలంటే లేఖ ఒక్క‌టే ఏకైక మార్గ‌మ‌ని ఆయ‌న బ‌లంగా న‌మ్ముతున్న‌ట్టున్నారు. తాజాగా ఆయ‌న సీఎం జ‌గ‌న్‌కు ఓ విచిత్ర‌మైన లేఖ రాశారు. వైసీపీ ఎంపీలు విజ‌య‌సాయిరెడ్డి, మిథున్‌రెడ్డి ట్వీట్ల‌పై క‌న్నా అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ…ఆ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు క‌న్నా ప్రేమ లేఖ రాశారు.

విద్యుత్ చార్జీల విష‌యంలో బీజేపీలో చేరిన టీడీపీ నేత‌లు త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌ని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి విమ‌ర్శించారు. ఇక విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ విష‌యానికి వ‌స్తే కాస్త ఘాటుగానే ఉంది.

“ఏమీ తినడానికి దొరకని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) మిడతల దండు కమలం పువ్వు వైపు కదులుతోంది. ఇప్పటికే కొన్ని మిడతలు బీజేపీలో చేరి విధ్వంసం సృష్టిస్తున్నాయని గ్రహించేలోపే, మిగతావి ఎగురుకుంటూ బయల్దేరాయి. ఈ విపత్తు నుంచి బీజేపీ ఎలా గట్టెక్కుతుందో ముందు ముందు చూడాలి” అని విజ‌య‌సాయి త‌న మార్క్ ట్వీట్ చేశారు.

బ‌హుశా విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ బాగా సెగ త‌గిలిన‌ట్టుంది. అందుకే ఆయ‌న ట్వీట్ ఇచ్చిన 24 గంట‌ల త‌ర్వాత క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ సీఎంకు లేఖ రాయ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది. సీఎంకు రాసిన లేఖ‌లో  టీడీపీ నేతల చేరికపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.  

తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఇతర పార్టీ నేతల జోక్యం అవసరం లేదని  ఆయ‌న తెలిపారు. ఈ విషయంలో వైసీపీ ఎంపీలకు జగన్ కౌన్సిలింగ్ ఇస్తే మంచిదని హితవు చెప్పారు. బీజేపీ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని కన్నా హెచ్చరిం చారు.

క‌న్నాతో పాటు బీజేపీ నేత‌లు మాత్రం అంద‌రికీ హిత‌వు చెప్ప‌డానికి ప్ర‌త్యేక హ‌క్కు క‌లిగి ఉన్న‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. త‌మ గురించి మాట్లాడొద్ద‌ని చెప్పాల‌ని సీఎంకు లేఖ రాయ‌డం చిన్న పిల్ల‌ల చేష్ట‌ల‌ను త‌ల‌పిస్తున్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రాజ‌కీయాల‌న్న త‌ర్వాత విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు స‌ర్వ సాధార‌ణం.

బ‌హుశా టీడీపీ నుంచి వెళ్లిన వారి గురించి మాత్ర‌మే విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశార‌ని, మ‌రి కాంగ్రెస్ నుంచి వెళ్లిన త‌న గురించి ప‌ట్టించుకోలేద‌ని క‌న్నా మ‌న‌స్తాపం చెందారా? ఏమో ఆయ‌న లేఖ చూస్తే అట్లే ఉంద‌నిపిస్తోంది. ఇట్లే త‌న‌పై రూ.20 కోట్ల అవినీతి ఆరోప‌ణ‌లు విజ‌య‌సాయి చేస్తే…చివ‌రికి క‌న్నా ఏమీ చేయ‌లేక చేతులెత్తేయ‌డం చూశాం. ప‌దేప‌దే స‌హించ‌మ‌ని హెచ్చ‌రించ‌డం ద్వారా చివ‌రికి అభాసుపాలు కాక త‌ప్ప‌ద‌ని క‌న్నా గ్ర‌హిస్తే మంచిది. 

చచ్చిపోతానేమో అని చాలా భయమేసింది