కార్తికేయ-నేహాశెట్టి కాంబినేషన్ లో డైరక్టర్ క్లాక్స్ అందిస్తున్న సినిమా బెదురులంక. ముప్పనేని బెనర్జీ (బెన్నీ) నిర్మాత. యుగాంతం వస్తుందని వార్తలు, వదంతులు వచ్చిన నేపథ్యంలో గోదారి మధ్యలోని ఓ లంక గ్రామంలో జరిగిన హడావుడే సినిమా. దీనికి అదనంగా హీరో..హీరోయిన్ల రొమాన్స్. వెరసి రోమ్ కామ్ అనుకోవాలి.
ట్రయిలర్ ను రెండు విధాలా కట్ చేసారు. హీరో..హీరోయిన్ల రొమాంటిక్ సీన్లు..అజయ్ ఘోస్, రామ్ ప్రసాద్, శ్రీకాంత్ అయ్యంగార్ ల కామెడీ..ఇలా రెండూ కలిపి పెర్ ఫెక్ట్ గా మిక్స్ చేసారు.
ట్రయిలర్ లో అయితే బాగానే మిక్స్ అయ్యాయి. కానీ సినిమాలో ఏ మేరకు మిక్స్ అయ్యాయి..ఈ సీన్లు వచ్చినపుడు ఇంట్రస్టింగ్ గా, ఆ సీన్లు వచ్చినపుడు అనాసక్తిగా వుంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. ట్రయిలర్ లో బాగానే మిక్స్ చేసారు కనుక, సినిమాలో కూడా చేసి వుంటారనే అనుకోవాలి.
ట్రయిలర్ కట్ లో కేవలం హీరో మీద వెళ్లకుండా, ఎంత వరకు వెళ్లాలో అంత వరకే వెళ్లి, కామెడీ కంటెంట్ కు ప్రయారిటీ ఇచ్చారు. మణిశర్మ ఆర్ఆర్ కూడా అదే స్టయిల్ లో వెళ్లింది. ఈ నెల 25న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది.