ముందుగా సినిమా ప్రకటిస్తారు. ఆ తర్వాత హీరోయిన్ ను వెదుకుతారు. కొన్ని సినిమాలకైతే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యేవరకు హీరోయిన్ ఫైనల్ చేయరు. కానీ బెల్లంకొండ సాయిశ్రీనివాస్ అలా కాదు. ఇతడికి సినిమా ఎంత ముఖ్యమో, ఆ సినిమాలో హీరోయిన్ కూడా అంతే ముఖ్యం.
తన సినిమాల్లో కచ్చితంగా కూసింత స్టార్ వాల్యూ ఉన్న హీరోయిన్ ను పెట్టుకోవాలనుకుంటాడు ఈ నటుడు. ఇన్నాళ్లూ అదే చేశాడు. ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీస్ విషయంలో కూడా అదే రిపీట్ చేస్తున్నాడు.
టైసన్ నాయుడు కోసం నేహాశెట్టిని తీసుకున్నాడు. ఇందులో ప్రగ్యా జైశ్వాల్ కూడా కీలక పాత్రలో కనిపించనుంది. త్వరలోనే చేయబోయే మరో సినిమా కోసం తన లక్కీ గర్ల్ అనుపమ పరమేశ్వరన్ ను రిపీట్ చేస్తున్నాడు.
ఇక రీసెంట్ గా లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో తన 12వ చిత్రాన్ని చేయబోతున్నట్టు ప్రకటించాడు బెల్లంకొండ. ఇందులో హీరోయిన్ గా సంయుక్త మీనన్ ను తీసుకున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఉంది. అందులో కూడా క్రేజ్ ఉన్న హీరోయిన్ నే తీసుకోబోతున్నారు.
ఇప్పటికే సమంత, రకుల్, పూజాహెగ్డే, కాజల్ లాంటి హీరోయిన్లతో సినిమాలు చేసేశాడు ఈ హీరో. ఇప్పుడు లేటెస్ట్ హాట్ హీరోయిన్లపై దృష్టి పెట్టాడు.
జనం పట్టించుకోరు
ఎవరు ఫిక్స్ అయినా మేం థియేటర్లో చూడం
Bellam annani choosi audiunce yelagu raranikanersam heroine ni choosi 4 tickets tegutayani anna plan