భగవంత్ కేసరి ట్రయిలర్.. మళ్లీ తెరపైకి భోళాశంకర్

భగవంత్ కేసరి ట్రయిలర్ రిలీజైంది. మళ్లీ తెరపైకి భోళాశంకర్ పేరు వచ్చింది. రిలీజ్ కు రెడీ అయిన సినిమా భగవంత్ కేసరి, రిలీజై ఎపిక్ డిజాస్టర్ అనిపించుకున్న సినిమా భోళాశంకర్. మరి ఈ రెండు…

భగవంత్ కేసరి ట్రయిలర్ రిలీజైంది. మళ్లీ తెరపైకి భోళాశంకర్ పేరు వచ్చింది. రిలీజ్ కు రెడీ అయిన సినిమా భగవంత్ కేసరి, రిలీజై ఎపిక్ డిజాస్టర్ అనిపించుకున్న సినిమా భోళాశంకర్. మరి ఈ రెండు సినిమాల మధ్య పోలికేంటి? నెటిజన్లు మాత్రం ఓ పోలిక తీశారు. అది కూడా చాలా లాజికల్ గా అనిపించే కాంపారిజన్.

భోళాశంకర్ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడారు చిరంజీవి. ఇక భగవంత్ కేసరిలో కూడా తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడారు బాలయ్య. ఈ అంశాన్ని తీసుకుంటే.. చిరంజీవి కంటే బాలకృష్ణే తెలంగాణ యాసను బాగా పలికించారనే టాక్ సోషల్ మీడియాలో కనిపిస్తోంది.

తాజాగా భగవంత్ కేసరి ట్రయిలర్ రిలీజైంది. ఇందులో బాలయ్య తన మార్క్ డైలాగ్స్ చెప్పారు. అయితే వాటిని తెలంగాణ యాసలో చెప్పారు. తొలిసారి పూర్తిస్థాయిలో తెలంగాణ నేపథ్యాన్ని ఎంచుకొని బాలకృష్ణ చేసిన సినిమా ఇది. కాబట్టి ఈ మూవీలో ఆయన తెలంగాణ యాస ఎలా ఉందనే ఆసక్తి కొందరిలో ఉంది.

ట్రయిలర్ లో బాలయ్య తెలంగాణ యాస ఎబ్బెట్టుగా అనిపించలేదు. చివరికి ట్రయిలర్ రిలీజ్ ఫంక్షన్ లో కూడా బాలయ్య అక్కడక్కడ తెలంగాణ యాసలో మాట్లాడి మెప్పించారు. సరిగ్గా ఇదే సమయంలో భోళాశంకర్ లో చిరంజీవి మాట్లాడిన యాస తెరపైకొచ్చింది.

భోళాశంకర్ లో కూడా ఓ షేడ్ లో తెలంగాణ మాండలికంలో మాట్లాడారు చిరంజీవి. అయితే అది కాస్త ఇబ్బందికరంగా, కృత్రిమంగా అనిపించింది. అప్పట్లో దానిపై విమర్శలు కూడా చెలరేగాయి. ఇప్పుడు బాలయ్య, బ్రహ్మాండంగా తెలంగాణ యాసలో మాట్లాడడంతో మరోసారి చిరంజీవి మాట్లాడిన విధానం చర్చనీయాంశమైంది.