సంక్రాంతి బరిలో భగవంత్ కేసరి!

సంక్రాంతికి మహేష్ మూవీ లైన్లో ఉంది. వెంకటేష్, రవితేజ, విజయ్ దేవరకొండ, నాగార్జున సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. ఇప్పుడీ పోటీలోకి భగవంత్ కేసరి కూడా చేరింది. అయితే పైన చెప్పుకున్న హీరోల సినిమాలన్నీ…

సంక్రాంతికి మహేష్ మూవీ లైన్లో ఉంది. వెంకటేష్, రవితేజ, విజయ్ దేవరకొండ, నాగార్జున సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. ఇప్పుడీ పోటీలోకి భగవంత్ కేసరి కూడా చేరింది. అయితే పైన చెప్పుకున్న హీరోల సినిమాలన్నీ థియేటర్లలోకి వస్తుంటే, అదే టైమ్ లో బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది భగవంత్ కేసరి.

థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడిచిన ఈ సినిమా, సంక్రాంతికి టీవీల్లో సందడి చేయబోతోంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు ఛానెల్ దక్కించుకుంది. సంక్రాంతికి సినిమాను టెలికాస్ట్ చేయబోతోంది. 

అయితే ఈ సినిమా ప్రసారానికి డిజిటల్ స్ట్రీమింగ్ తో లింక్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో భగవంత్ కేసరి డిజిటల్ రైట్స్ దక్కించుకుంది. అమెజాన్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన నెల రోజుల్లో టీవీల్లో ఈ సినిమాను ప్రసారం చేయాల్సి ఉంది. ఈ లెక్కన చూసుకుంటే, డిజిటల్ లో ఈ సినిమా నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటివారంలో వచ్చే అవకాశం ఉంది.

అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన ఈ సినిమా, బాలయ్య కెరీర్ లో విలక్షణ చిత్రంగా నిలిచింది. తన ఇమేజ్, స్టయిల్ కు భిన్నంగా బాలయ్య చేసిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది. 3-4 సెంటర్లు మినహా, దాదాపు బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ సినిమాతో తన హిట్ ట్రాక్ ను అలానే కొనసాగిస్తూ వచ్చాడు అనీల్ రావిపూడి.

కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలయ్యకు కూతురు వరుస పాత్రలో శ్రీలీల నటించింది. తమన్ సంగీతం అందించాడు. స్మాల్ స్క్రీన్ పై ఈ సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.