హిట్ మూవీ వెనకబడింది.. ఫ్లాప్ సినిమా హిట్టయింది

థియేటర్లలో హిట్టయిన సినిమా బుల్లితెరపై కూడా హిట్టవ్వాలని లేదు. అదే విధంగా థియేటర్లలో ఫ్లాప్ అయిన సినిమా టీవీల్లో కూడా ఫ్లాప్ అవుతుందనే గ్యారెంటీ లేదు. ఈ విషయాన్ని గతంలోనే కొన్ని సినిమాలు ప్రూవ్…

థియేటర్లలో హిట్టయిన సినిమా బుల్లితెరపై కూడా హిట్టవ్వాలని లేదు. అదే విధంగా థియేటర్లలో ఫ్లాప్ అయిన సినిమా టీవీల్లో కూడా ఫ్లాప్ అవుతుందనే గ్యారెంటీ లేదు. ఈ విషయాన్ని గతంలోనే కొన్ని సినిమాలు ప్రూవ్ చేశాయి. తాజాగా మరో 2 సినిమాలు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మారాయి.

రామ్ నటించిన స్కంద-ది ఎటాకర్, బాలకృష్ణ చేసిన భగవంత్ కేసరి సినిమాలు రెండూ ఒకే రోజు టీవీల్లో ప్రసారమయ్యాయి. తొలిసారి బుల్లితెర వీక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాల్లో రామ్ సినిమా పైచేయి సాధించింది. 

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్కంద సినిమాను స్టార్ మా ఛానెల్ లో ప్రసారం చేశారు. దీనికి 8.4 టీఆర్పీ వచ్చింది. థియేటర్లలో ఈ సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. 

ఇక బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాను జీ తెలుగులో టెలికాస్ట్ చేశారు. దీనికి 7.69 రేటింగ్ వచ్చింది. థియేటర్లలో ఈ సినిమా సక్సెస్ అయిన సంగతె తెలిసిందే. 

ఇలా ఓ హిట్ మూవీ కంటే, ప్లాప్ అయిన సినిమాకు బుల్లితెరపై ఆదరణ దక్కడం విశేషం. గతంలో వినయ విధేయ రామ విషయంలో కూడా ఇదే జరిగింది.