భగవంత్ తో పాటే ఘోస్ట్

లోలోపల సమాచారం మారుతూ వస్తుందో ఏమిటో కానీ, ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ మొదలవుతుంది అన్ని భాషల్లో. అలాంటి సినిమాలు లేదా అలాంటి సినిమాలే అనిపించే సినిమాలు వరుసగా వస్తుంటాయి.  Advertisement సీనియర్ హీరో జైలర్…

లోలోపల సమాచారం మారుతూ వస్తుందో ఏమిటో కానీ, ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ మొదలవుతుంది అన్ని భాషల్లో. అలాంటి సినిమాలు లేదా అలాంటి సినిమాలే అనిపించే సినిమాలు వరుసగా వస్తుంటాయి. 

సీనియర్ హీరో జైలర్ వచ్చేసింది తమిళంలో. రజనీ బ్లాక్ బస్టర్ కొట్టారు. కొడుకు సెంటిమెంట్ అదనం దీనికి. అంతకు ముందు జైలు టచ్ లేకున్నా గ్రాండ్ చిల్డ్రన్ సెంటిమెంట్‌తో సీనియర్ హీరో కమల్ సినిమా చేసి, విక్రమ్ తో హిట్ కొట్టారు.

తెలుగులో జైలు, కూతురు సెంటిమెంట్ తో సీనియర్ హీరో బాలయ్య దసరా టైమ్‌కు భగవంత్ కేసరి అంటూ దిగిపోతున్నారు. ఇందులో కూడా జైలులో భారీ యాక్షన్ సీన్ వుంటుంది. ఇది ఇలా వుంటే కన్నడం నుంచి మరో సినిమా వస్తోంది. అక్కడి సీనియర్ హీరో శివరాజ్ కుమార్ నటించిన ఘోస్ట్ సినిమా ఇది. దీని ట్రయిలర్ వచ్చింది. భారీ యాక్షన్ సినిమా. జైలు సెటప్. జైలులో భారీ యాక్షన్ సీన్లు.

గమ్మత్తేమిటంటే ఈ సినిమా కూడా బాలయ్య సినిమాతో పాటే శివరాజ్ కుమార్ ఘోస్ట్ కూడా విడుదలవుతోంది. పైగా ఇద్దరూ మాంచి స్నేహితులు కూడా. సరే, మన దగ్గర శివరాజ్ కుమార్ సినిమా ఎవరు చూస్తారు అని అనేయచ్చు. కానీ సమస్య ఏమిటంటే విడుదల వరకు ఆ మాట వాస్తవం. కానీ సినిమా బాగుంటే అది శివరాజ్ కుమార్ నా? మరొకరా అన్నది ఇప్పుడు మనవాళ్లు చూడడం లేదు. కొత్తగా, బాగా ఎవరు తీసారు.. ఏం తీసారు.. అన్నదే చూస్తున్నారు.

అందువల్ల మనవాళ్లు ఈ కాంపిటీషన్ ను, క్వాలిటీని దృష్టిలో వుంచుకుని ముందుకు వెళ్లాలి.