ఈసారి అయినా నాని కి సరైన సినిమా!

హీరో నాని కెరీర్ పై పైకే సాగుతోంది. ఒకప్పుడు తొమ్మిది కోట్ల మేరకు వున్న రెమ్యూనిరేషన్ ఇప్పుడు ఇరవై కోట్లకు పైనే వుందని ఇండస్ట్రీ టాక్. కానీ సినిమాలు మాత్రం నిర్మాతలకు వర్కవుట్ అవుతున్నాయా?…

హీరో నాని కెరీర్ పై పైకే సాగుతోంది. ఒకప్పుడు తొమ్మిది కోట్ల మేరకు వున్న రెమ్యూనిరేషన్ ఇప్పుడు ఇరవై కోట్లకు పైనే వుందని ఇండస్ట్రీ టాక్. కానీ సినిమాలు మాత్రం నిర్మాతలకు వర్కవుట్ అవుతున్నాయా? అంటే అనుమానమే. వర్కవుట్ సంగతి అలా వుంచితే సరైన హిట్ లు పడడం లేదు. 

దేవదాస్ నుంచి దసరా వరకు చూసుకుంటే గుడ్ అనిపించుకున్నవి మూడే మూడు. జెర్సీ, శ్యామ్ సింగ రాయ్, దసరా. వీటిలో జెర్సీకి డబ్బులు కొన్ని ఏరియాలకు వెనక్కు ఇచ్చుకోవాల్సి వచ్చింది. శ్యామ్ సింగరాయ్ కాస్ట్ ఫెయిల్యూర్ అన్నది వాస్తవం. దసరా సినిమాకు భారీగా ఖర్చు చేయాల్సి రావడంతో అది కూడా నిర్మాతకు లాభదాయకం కాలేదు.

ఇక మిగిలిన సినిమాలు దేవదాస్, గ్యాంగ్ లీడర్, వి, టక్ జగదీష్, అంటే సుందరానికి సంగతి తెలిసిందే. అంటే మూడు గుడ్.. అయిదు బ్యాడ్ సినిమాలు అయితే, వాటిలో ఆ మూడింటికి కూడా కాస్ట్ సరిపోలేదు. దీనికి కారణం ఏమిటి అన్నది నాని ఆలోచించుకోవాల్సిన టైమ్ వచ్చింది. 

హాయ్ నాన్న సినిమా కాస్త తక్కువ బడ్జెట్ లోనే అయిపోతుందని మొదలుపెట్టారు. కానీ అక్కడ కూడా మరీ దసరా అంత కాకున్నా, ఓ రేంజ్ లో ఖర్చయినట్లు తెలుస్తోంది. పైగా ఈ సినిమాకు నాని ఇరవై కోట్లకుపైగా రెమ్యూనిరేషన్ తీసుకున్నారని టాక్ వుంది. పైగా దసరా టైమ్ లో మాదిరిగానే ఈ సినిమా దర్శకుడు కూడా నిర్మాతల మాట వినలేదని మరో గ్యాసిప్ వుంది. నాని నమ్మితే మాత్రం ఇక దర్శకులు ఎలా చెబితే అలా ముందుకు వెళ్లిపోతారు. దాంతో ఖర్చు పెరిగిపోతుంది.

ఇప్పుడు ఈ సినిమాకు కూడా నాన్ థియేటర్ హక్కులు ఇంకా పూర్తిగా అమ్ముడు పోలేదు. సోలో డేట్ దొరికితే థియేటర్ మార్కెట్ బాగుంటుంది. కానీ మూడు నాలుగు సినిమాల నడుమ రావాల్సి వస్తోంది. దీని తరువాత నాని రెండు సినిమాలు సైన్ చేసారు. ఒకటి డివివి దానయ్య-వివేక్ ఆత్రేయ, రెండవది చిట్టూరి శ్రీను-డాన్ సినిమా డైరక్టర్ తో. వీటి మీద అయినా జాగ్రత్తగా దృష్టి పెట్టాలి. రెమ్యూనిరేషన్, ఖర్చులు తగ్గించాలి. సినిమాలు అటు మంచివి అనిపించుకోవాలి. నిర్మాతకు ఓ రూపాయి మిగిల్చాయి అని కూడా అనిపించాలి.

రాను రాను నాన్ థియేటర్ మార్కెట్ కిందకు దిగుతోంది. ఈ సంగతి అందరు హీరోలు గమనించాల్సి వుంటుంది.