భగవంత్ కేసరి..నందమూరి బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా. ఈ సినిమా అటు బాలయ్య లేదా ఇటు అనిల్ రావిపూడి రెగ్యులర్ పాట్రన్ లో వుండదని చెబుతూ వస్తున్నారు.
బాలయ్య-శ్రీలీల ఎమోషనల్ బాండింగ్ మీద ఈ సినిమా ఎక్కువ ఫోకస్ అవుతుందని చెబుతున్నారు. మరి ఇలా అయితే బాలయ్య ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది ఓ అనుమానం.
కానీ అసలు విషయం ఏమిటంటే సినిమా ఎంత కొత్త జానర్ లో వున్నా, సినిమాలో మాత్రం అయిదు భారీ యాక్షన్ సీక్సెన్స్ లు వుంటాయట. సినిమా స్టార్టింగ్ లో జైలులో ఒకటి, ఇంటర్వెల్ బ్యాంగ్ కు మరోటి మాంచి భారీ ఫైట్లు చిత్రీకరించారట.
అలాగే మలిసగం ఆరంభంలో ఒక ఫైట్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఒకటి, క్లయిమాక్స్ లో ఒకటి భారీ ఫైట్లు చిత్రీకరించారట. మొత్తం మీద ఎమోషన్లు, యాక్షన్ సీన్లు కలిపి జోడీ గా పెనవేసుకునేలా స్క్రీన్ ప్లే తయారు చేసుకున్నారట దర్శకుడు అనిల్ రావిపూడి.
అంటే ఇదేదో అస్సలు కమర్షియల్ గా వుండదని బాలయ్య ఫ్యాన్స్ అస్సలు టెన్షన్ పడాల్సిన పనే వుండదన్న మాట.