బాలయ్య-అనిల్ రావిపూడి కాంబినేషన్లో సాహు గారపాటి నిర్మిస్తున్న సినిమా భగవత్ కేసరి. దసరాకు మాంచి కాంపిటీషన్ లో విడుదలవుతోంది.
అఖండ సినిమా బ్లాక్ బస్టర్ కావడం, వీరసింహారెడ్డి కూడా కలెక్షన్ల పరంగా ఓకె అనిపించుకోవడం, అనిల్ రావిపూడి డైరక్టర్ కావడంతో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దాంతో రెండు నెలలకు ముందే బిజినెస్ క్లోజ్ అయింది. టోటల్ గా థియేటర్ మీద 70 కోట్లు ఆదాయం కనిపిస్తోంది.
ఆంధ్ర ఏరియాను 35 కోట్లకు, సీడెడ్ ను 13 కోట్లకు నైజాం ను 15 కోట్లకు విక్రయించారు. ఓవర్ సీస్ ను అయిదు కోట్లకు వాల్యూ కట్టి ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు. అదర్ ఏరియాస్ నుంచి మరో రెండు మూడు కోట్లు వస్తోంది. మొత్తం మీద 70 కోట్లకు పైగా థియేటర్ మార్కెట్ చేసారు. ఇంకా నాన్ థియేటర్ వుండనే వుంది.
సినిమాకు వంద కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. శ్రీలీల, కాజల్ ఇలా కాస్త గట్టి కాస్టింగ్ నే వుంది. టెక్నికల్ కాస్టింగ్ కూడా బాగానే వుంది. కానీ అటు లియో, ఇటు టైగర్ నాగేశ్వరరావు సినిమాల పోటీని తట్టుకోవాల్సి వుంది.