Advertisement

Advertisement


Home > Movies - Movie News

‘భరతనాట్యం’ బాగుంటుంది

‘భరతనాట్యం’ బాగుంటుంది

సూర్య తేజ ఏలే డెబ్యు మూవీ 'భరతనాట్యం'. దొరసాని ఫేమ్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. పిఆర్ ఫిలింస్ పతాకంపై పాయల్ సరాఫ్ నిర్మించారు. మీనాక్షి గోస్వామి కథానాయిక. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదలకు కానుంది. ఈ సందర్భంగా హీరో సూర్య తేజ ఏలే విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

నిజానికి నేను హీరో కావాలని అనుకోలేదు. చిన్నప్పటి నుంచి సినిమాల్లో కి రావాలి, డైరెక్షన్ చేయాలనే ఆసక్తివుండేది. కాలేజ్ పూర్తయిన తరవాత రచనపై ఆసక్తి ఏర్పడింది. కథలు రాయడం,  నెరేట్ చేయడం.. ఇలా స్ట్రగులింగ్ లో వున్న సమయంలో హితేష్ కి నేను చెప్పిన కథ నచ్చింది. తర్వాత దర్శకుడు కెవిఆర్ మహేంద్ర కి కథ చెప్పాను. ఆయనకి నచ్చింది. కథ రాసినప్పుడు నేను హీరోగా చేస్తానని అనుకోలేదు. నిజానికి ఇందులో నా పాత్ర ఏ కొత్త నటుడు చేసినా బావుటుంది. దర్శకుడు, నిర్మాతలు ఈ పాత్ర నేను చేస్తే బావుంటుందని సమిష్టి నిర్ణయం తీసుకున్న తర్వాత చేయడం జరిగింది.

'భరతనాట్యం' ఫిక్షనల్ స్టొరీ. కానీ రియల్ లైఫ్ తో రిలేట్ చేసుకునేలా వుంటుంది. ఒక మనిషి షార్ట్ కట్ లో వెళితే ఏం జరుగుతుందనేది ఈ సినిమా పాయింట్. పర్శనల్ గా ఫీలైన స్ట్రగుల్స్ ని కామికల్ గా చేసి రాసింది. కమర్షియల్ గా చాలా మంచి ఎంటర్ టైనర్. ఈ కథకు 'భరతనాట్యం' పర్ఫెక్ట్ టైటిల్. అది ఎలా అనేది సినిమా చూస్తున్నపుడు తెలుస్తుంది.

మా నాన్న ధని ఏలే సినీ పరిశ్రమలో పాతికేళ్ళుగా పబ్లిసిటీ డిజైనర్ గా పని చేస్తున్నారు. నేను పెయిటింగ్ లో ఫైన్ ఆర్ట్స్, మాస్టర్స్ చేశాను. సినిమా టైటిల్స్ రాస్తుంటాను. డిజైనింగ్, ఎడిటింగ్ లో అనుభవం వుంది. కోవిడ్ తర్వాత రైటింగ్ లోకి వచ్చాను. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. వివేక్ సాగర్ గారు ట్రెండీ ఆర్ఆర్ ఇచ్చారు. ఈ స్కేల్ సినిమా తీసినందుకు చాలా ఆనందంగా వుంది. ఆడియన్స్ అంతా చాలా ఎంజాయ్ చేస్తారు అని చెప్పారు సూర్య తేజ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?