Advertisement

Advertisement


Home > Movies - Movie News

భారతీయుడు2 ట్రయిలర్ వస్తోంది

భారతీయుడు2 ట్రయిలర్ వస్తోంది

కల్కి హడావుడి జరుగుతూ వుండగానే ఇండియన్ 2/ భారతీయుడు 2 ట్రయిలర్ కూడా వస్తోంది. విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత కమల్ హాసన్ చేస్తున్న సినిమా ఇది.

తమిళ నాట మాత్రమే కాదు. తెలుగు నాట కూడా ఎదురుచూసేవారు పెద్ద సంఖ్యలోనే వున్నారు. తమిళనాట కమల్ ఫ్యాన్స్ సంగతి చెప్పనక్కరలే లేదు. దర్శకుడు శంకర్ కావడంతో, తెలుగు జనాలకు వేరే రకాల ఆసక్తి కూడా వుంది.

ఇండియన్ 2 కన్నా ముందు స్టార్ట్ చేసిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఎలా వుండబోతోందో అన్న ఆసక్తి వుంది. ఇటీవల కొన్నేళ్లుగా సరైన సక్సెస్ ట్రాక్ లేదు శంకర్ కు. అందువల్ల శంకర్ లో ఇంకా ఆనాటి టాలెంట్ వుందా లేదా? అన్న అనుమానాలు వుండనే వున్నాయి. గేమ్ ఛేంజర్ విడుదల కావడానికి ఇంకా మూడు నెలల సమయం వుంది. ఈ లోగా వైనం తెలియాలంటే మార్గం భారతీయుడు 2 ట్రయిలర్ మాత్రమే.

అందుకే భారతీయుడు 2 ట్రయిలర్ కోసం చరణ్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 25 ముంబాయి లో ట్రయిలర్ ను విడుదల చేస్తున్నారు. ట్రయిలర్ నిడివి రెండు నిమిషాల 36 సెకెండ్లు వుంటుంది. మంచి పవర్ ఫుల్ డైలాగులు వున్నాయని తెలుస్తోంది.

 


  • Advertisement
    
  • Advertisement