ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్ కల్కి సినిమా రిలీజ్ ట్రయిలర్ వచ్చింది. మొదటి ట్రయిలర్ కు బాగానే అప్లాజ్ వచ్చినా కాస్త మిక్స్ డ్ టాక్ కూడా వచ్చింది. అందుకే కావచ్చు లేదా, విడుదల ముందు మరో ట్రయిలర్ వుండాలని కావచ్చు ఈ రోజు వదిలారు. రెండు నిమిషాల 22 సెకెండ్ల ట్రయిలర్. కానీ చివర టైటిల్స్ అన్నీ చూసుకుంటే నిడివి కాస్త తక్కువే.
పైగా దాదాపు ఒక నిమిషం పాటు ఓ ఎమోషనల్ సాంగ్ ను బ్యాక్ గ్రౌండ్ లో రన్ చేస్తూ, కథకు సంబంధించిన వివిధ షాట్ లు వేసారు. వాటిలో భూమి మీద జనం అగచాట్లు, హీరో యాక్షన్ సీన్లు ఇలా అన్నీ వున్నాయి. అశ్వద్దామ అయిన అమితాబ్ కు మధ్య సినిమాలో భారీ ఫైట్ వుందని వార్తలు వున్నాయి. దాని కట్స్ కొన్ని వేసారు.
దీపిక కడపులో భగవంతుడి అంశ వుండడం, ఆమెను ఎక్కడికో పంపించడం, విలన్లు ఆమెను చంపాలనుకుంటే అశ్వద్దామ అడ్డం పడడం ఇలా కొంత కథ చెప్పారు. ఆరు వందల ఏళ్ల తరువాత భూమి పరిస్థితి చాలా దారుణంగా వుంటుందనే విజువల్స్ కూడా వేసారు. ఫస్ట్ ట్రయిలర్ లోంచి రెండు మూడు సీన్లు మళ్లీ సెకెండ్ ట్రయిలర్ లోకి తెచ్చారు. ప్రభాస్ కు అంతకన్నా మంచి డైలాగ్ మరోటి లేదా? ఏమో?
మొత్తం మీద మొదటి ట్రయిలర్, రెండో ట్రయిలర్ కలిపితే, సినిమా గురించి కాస్త అవగాహన వస్తుంది. డబ్బింగ్ వాయిస్ లు ఫోన్ ల్లో, చిన్న డివైస్ ల్లో ఎలా వున్నా, థియేటర్లో కచ్చితంగా బాగుంటుంది అనిపిస్తోంది.