భీమ్లా నాయక్ డ్రీమ్ రన్ నిన్నటితో అయిపోయినట్లే. ఇక వీకెండ్ లు మాత్రమే. కానీ ఈ వీకెండ్ నుంచి కొత్త సినిమాలు వరుసగా వస్తున్నాయి. అందువల్ల విడుదల డేట్ నుంచి శివరాత్రి వరకే డ్రీమ్ రన్. అది పూర్తయిపోయింది.
ఇంతకీ భీమ్లా నాయక్ ను కొన్న బయ్యర్లు సేఫ్ నా కాదా? అదీ పాయింట్. ఇక్కడ లక్ ఫ్యాక్టర్ ఏమిటంటే ఒక్క వైజాగ్ బయ్యర్ మినహా మిగిలిన అన్ని ఏరియాలు బయ్యర్లు అమౌంట్లు తగ్గించి కట్టడం.
సినిమాను అసలే తక్కువ రేట్లకు ఇచ్చారు. నైజాం 30 కోట్లకు, ఆంధ్ర 40 కోట్లకు ఇచ్చేసారు. అలా ఇచ్చిన 40 కోట్లకు కూడా బయ్యర్లు కట్టింది 35 కోట్లే. నిజానికి సరైన పరిస్థితులు, రేట్లు వుండి వుంటే ఆంధ్ర కనీసం 45 కోట్ల మేరకు ఇచ్చి వుండే అవకాశం వుండేది. ఆ విధంగా నిర్మాత 10 కోట్లు నష్టపోయినట్లే.
ఆంధ్ర 35 కోట్ల మేరకు మాత్రమే కట్టడంతో బయ్యర్లు సేఫ్ అయ్యే అవకాశం వచ్చింది. ఈస్ట్, వెస్ట్ ల్లో పవన్ కు వున్న క్రేజ్ వల్ల ముందుగానే ఫిక్స్ డ్ హయ్యర్లతో డబ్బులు లాగేసారు. దానివల్ల ఈ రెండు జిల్లాల్లో బయ్యర్లు సేఫ్. గుంటూరు ఏరియాకు ఏకంగా కోటిన్నర తక్కువ కట్టారు. దాంతో అక్కడ సమస్య లేదు.
విశాఖ ఏరియా మాత్రం సమస్య అయ్యే అవకాశం వుంది. అక్కడ దగ్గర దగ్గర 10 కోట్లు కట్టారు. ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల దగ్గర ఆగుతుందని ట్రేడ్ వర్గాల బోగట్టా. అలాగే కృష్ణ జిల్లాలో రేట్ల సమస్య ఎక్కువ వుంది. కానీ అక్కడ కూడా కోటి రూపాయలు ముందే తగ్గించి కట్టడం వల్ల చాలా వరకు సేఫ్ అయ్యే అవకాశం వుంది.
నైజాం జిఎస్టీ కాకుండా 30 కోట్లకు ఇచ్చేయడం వల్ల ఫస్ట్ వీక్ లోనే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది.సీడెడ్ లో సింగిల్ బయ్యర్ కాకపోవడం, అక్కడ టికెట్ రేట్లు భారీగానే అమ్మడం వల్ల సమస్య కాదు.
కానీ ఎటొచ్చీ నిర్మాతకే రావాల్సిన డబ్బులు రాలేదు. అన్నీ బాగా వుండి వుంటే మరో పది కోట్లకు పైనే వచ్చి వుండేవి. కానీ అలా జరగలేదు. ఓవర్ ఫ్లోస్ వస్తాయి అనుకంటే సినిమా శివరాత్రికి ముందే డ్రాప్ అయిపోయింది. శివరాత్రి హాలీడే ఆదుకుంది. కానీ మళ్లీ మర్నాడు డౌన్ నే. ఈవారం రెండు మూడు సినిమాలు వుండడం, వచ్చేవారం రాధేశ్వామ్ వుండడం వల్ల థియేటర్లు తగ్గిపోతాయి. రేట్లు తగ్గిపోతాయి. అందువల్ల బయ్యర్లకు ఖర్చులకు వస్తాయి తప్ప. నిర్మాతకు ఓవర్ ఫ్లోస్ రావడం అసాధ్యం.
దాదాపు150 కోట్లకు పైగా ఖర్చు చేసి, భారీ సినిమా బాధలు అన్నీ పడి, సినిమా తీస్తే పరిస్థితి ఇది.