పవన్ కళ్యాణ్..రానా కాంబినేషన్ లో సాగర్ చంద్ర డైరక్షన్ లో తయారైన సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా విడుదలై మూడు రోజులు దాటింది. ఇంకా రన్ వుంది. కానీ అప్పుడే ఓ ఫేక్ ప్రచారం ప్రారంభమైంది.
రేట్లు తక్కువ కావడంతో బయ్యర్లకు నష్టం వస్తుంది కనుక కొంత నష్టాన్ని నిర్మాత, మరి కొంత నష్టాన్ని హీరో పవన్ భరించబోతున్నారనంటూ అప్పుడే ప్రచారం మొదలైపోయింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ఇదంతా ఫేక్ నే.
భీమ్లా నాయక్ సినిమాను ఆంధ్ర (సీడెడ్ కాకుండా) 40 కోట్ల రేషియోలో విక్రయించారు. విశాఖ ఏరియా అయితే అంతకన్నా కాస్త ఎక్కువే పడింది. అయితే బయ్యర్లు ఒక్క విశాఖ మినహా ఈస్ట్, వెస్ట్, కృష్ణ, గుంటూరు, నెల్లూరు ఏరియాలకు అనుకున్న మొత్తాలకన్నా బాగా తగ్గించి కట్టారు. ఈస్ట్ 85 లక్షలు, వెస్ట్ 80 లక్షల మేరకు తక్కువ కట్టారు. గుంటూరు కోటి, కృష్ణా కోటిన్నర తక్కువ కట్టారు.
మొత్తం మీద నాలుగు కోట్లు అక్కడే తగ్గించేసినట్లు అయింది. నైజాం కూడా 30 కోట్లకే ఇచ్చేసారు. జీఎస్టీ కాకుండా. అందువల్ల భీమ్లా నాయక్ బిజినెస్ నే తగ్గించేసినట్లు అయింది. ఇంక వెనక్కు ఇవ్వడం అన్నది ఎక్కడ? కేవలం అక్కడికి పవన్ ఏదో దాతృత్వం చూపించారనే తప్ప. ఆంధ్ర 35 కోట్లు చేయక, నైజాం 30 కోట్లు చేయకపోతే ఇంకెక్కడి బ్లాక్ బస్టర్ టాక్?
పైగా వెనక్కు ఇవ్వాల్సిన పరిస్థితి అంటూ వస్తే ఒక్క వైజాగ్ కే అవసరం పడొచ్చు. ఎందుకంటే వైజాగ్ ఏరియాకు పోటీ రావడంతో పది కోట్లకు పైగా రేటుకు ఇచ్చారు. అందువల్ల అక్కడ ఏమైనా డెఫిసిట్ పడొచ్చు. అలా పడినా సమస్య కాబోదు.
పవన్ వెనక్కు ఇచ్చేంత వుండదు. ఎందుకుంటే సితార, హారిక హాసినికి వరుసగా సినిమాలు వున్నాయి కనుక, అక్కడ చూసుకుంటారు తప్ప, పవన్ దాతృత్వం చూపించేంత వుండదు.