భీమ్లా నాయక్ ను వెన్నాడుతున్న భయాలు

భీమ్లా నాయక్ సినిమా విడుదల సంక్రాంతి బరి నుంచి వాయిదా పడి ప్రీ సమ్మర్ టైమ్ కు చేరుకుంది. కానీ అప్పుడయినా విడుదల అవుతుందా? అన్నది అనుమానం. ఎందుకంటే భీమ్లా నాయక్ మేకర్లను అనేక…

భీమ్లా నాయక్ సినిమా విడుదల సంక్రాంతి బరి నుంచి వాయిదా పడి ప్రీ సమ్మర్ టైమ్ కు చేరుకుంది. కానీ అప్పుడయినా విడుదల అవుతుందా? అన్నది అనుమానం. ఎందుకంటే భీమ్లా నాయక్ మేకర్లను అనేక భయాలు వెన్నాడుతున్నాయి.  

ఒకటి కరోనా భయం. భీమ్లా నాయక్ విడుదల నాటికి కరోనా కనుక తగ్గకుండా ఇలాగే వుంటే ఆ వంకన సిఎమ్ జగన్ థియేటర్లకు ఫిప్టీ పర్సంట్ ఆక్యుపెన్సీ అమలు చేస్తారేమో అన్నది ఓ భయం.

అలాగే మరో భయం కూడా వుంది. రేట్ల వివాదం కనుక సద్దు మణిగి, ఏదో రేట్లు కాస్తయినా పెరిగి ఫిక్స్ కావాల్సి వుంది. అలా జరగకపోతే, భీమ్లా నాయక్ విడుదల టైమ్ లో ఎటువంటి ఎగస్ట్రాలు అమ్మకుండా వైకాపా జనాలు వేయి కళ్లతో కాపలా కాస్తారేమో అన్న భయం వెంటాడుతోంది.

పద్దతులు పాటించని, లైసెన్స్ లు లేని థియేటర్లకు నెల రోజులు గడువు ఇచ్చారు. ఆ గడువు తరువాత కూడా చూసీ చూడనట్లు ఊరుకోవచ్చు. కానీ అలాంటి థియేటర్లలో భీమ్లా నాయక్ పడితే మళ్లీ కథ మొదటికి వస్తుందేమో అన్నది ఇంకో భయం. 

కీలకమైన ఈ భయాలు తీరితే తప్ప భీమ్లా నాయక్ విడుదల కావడం కష్టం.