గోల్డెన్ చాన్స్ అంటున్న రాధేశ్యామ్

ఒక పక్క కొవిడ్ థర్డ్ ఫేజ్ తో అన్ని సినిమా రంగాలు కింకర్తవ్యమ్ అన్నట్లు కూర్చున్నాయి. తెలుగులో క్లియరెన్స్ సేల్ మాదిరిగా మూలన వున్న సినిమాలు అన్నీ బారులు తీరుతున్నాయి. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ…

ఒక పక్క కొవిడ్ థర్డ్ ఫేజ్ తో అన్ని సినిమా రంగాలు కింకర్తవ్యమ్ అన్నట్లు కూర్చున్నాయి. తెలుగులో క్లియరెన్స్ సేల్ మాదిరిగా మూలన వున్న సినిమాలు అన్నీ బారులు తీరుతున్నాయి. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సినిమా వాయిదా పడింది. కానీ ఇదే మంచి టైమ్ రావడానికి అని భావిస్తోంది రాధేశ్యామ్ టీమ్.

ఏ విధంగా మంచి టైమ్ అంటే దేశం మొత్తం మీద అన్ని భాషల్లోనూ సరైన సినిమా రావడం లేదు. అందుకే పుష్ప, అఖండ లాంటి సినిమాలు ఇంకా కలెక్షన్లు కళ్ల చూస్తున్నాయి. సో, ఇలాంటి టైమ్ లో వస్తే హిందీలో మాంచి కలెక్షన్లు రాబట్టవచ్చని రాధేశ్యామ్ ఆశపడుతోంది.

తెలుగులో ఆ సినిమాకు 100 కోట్ల మార్కెట్ వుంది. పోటీగా సరైన సినిమా లేదు. సంక్రాంతి సీజన్ కు ఛాయిస్ గా వుండే ఏకైక భారీ సినిమా. అందుకే ఎలాగైనా రాధేశ్యామ్ ను విడుదల చేయడానికే యువి సంస్థ మొగ్గు చూపుతోంది. 

అలా కాకుండా దేశంలో చాలా చోట్ల 100 శాతం లాక్ డౌన్ విధిస్తే మాత్రం విడుదల గురించి ఆలోచిస్తారట. లేదూ అంటే మాత్రం విడుదల పక్కా అంటున్నారు.