భీమ్లా నాయక్ కు ఏమయింది?

పెద్ద సినిమాలు, భయంకరంగా బజ్ వచ్చిన సినిమా సాధారణంగా రెండో రోజు జారిపోవు. ఎక్కువగా ఆన్ లైన్ బుకింగ్ లు వుంటాయి కనుక ముందే టికెట్ లు అమ్ముడయిపోతాయి.  Advertisement మీడియా ఏకగ్రీవంగా మాంచి…

పెద్ద సినిమాలు, భయంకరంగా బజ్ వచ్చిన సినిమా సాధారణంగా రెండో రోజు జారిపోవు. ఎక్కువగా ఆన్ లైన్ బుకింగ్ లు వుంటాయి కనుక ముందే టికెట్ లు అమ్ముడయిపోతాయి. 

మీడియా ఏకగ్రీవంగా మాంచి రిపోర్ట్ లు ఇచ్చిన భీమ్లా నాయక్ సినిమాకు రెండో రోజు కలెక్షన్లు జారిపోవాల్సిన అవకాశం లేదు. కానీ చిత్రంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు రెండో రోజు జారిపోయాయి. సిటీల్లో కొంత వరకు ఫరవాలేదు కానీ కింద సెంటర్లలో బాగా జారిపోయాయి.

సిటీల్లో కూడా ఆన్ లైన్ లో టికెట్ లు కొట్టేసి బ్లాక్ లో అమ్ముకుందాం అనుకున్న వారి దగ్గర గట్టిగానే టికెట్ లు మిగిలిపోయాయి. బయట హవుస్ ఫుల్ బోర్డులు కనిపించినా, లోపల ఖాళీలు కనిపించాయని ఎగ్ఙిబిటర్ వర్గాల టాక్. 

ఆ సంగతి ఎలా వున్నా, తొలి రోజు సీడెడ్ లో మూడు వందల నుంచి అయిదు వందలు అమ్మారు. అలాంటిది రెండో రోజు 200 వందలకు వచ్చేసింది. ఉత్తరాంధ్రలోని కింది సెంటర్లలో ఫుల్స్ కనిపించలేదు.

ఇక నైజాంలో సిటీ బాగుంది కానీ కింద సింగిల్ థియేటర్లు ఎక్కువగా పరిచేయడం వల్ల కూడా చాలా చోట్ల ఫుల్స్ కనిపించలేదు. నిజానికి భీమ్లా సినిమాను యాంటీ వైకాపా వర్గాలు గట్టిగా భుజాన వేసుకున్నాయి. 

వెబ్ సైట్లు అన్నీ మూడు ఆ పైన రేటింగ్ ఇచ్చాయి. మహా మహా రాజ‌కీయ నాయకులు ట్వీట్ లు వేసారు. ప్రభుత్వ నిబంధనలను తోసి రాజ‌ని ఆంధ్రలో ఒక్క కృష్ణా జిల్లా మినహా మిగిలిన అన్ని చోట్ల అదనపు రేట్లకే తొలి రోజు టికెట్ లు అమ్ముడయ్యాయి.

కానీ అలాంటిది చూస్తుంటే సినిమా డౌన్ ట్రెండ్ లో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. సెకండాఫ్ లో పాటలు లేవని, సినిమాలో ఫ్యాన్ మూమెంట్స్ తక్కువగా వున్నాయని, ఫ్యామిలీలకు పెద్దగా పట్టే సినిమా కాదని, రిపీట్ కు చాన్స్ లేదని అందువల్లే ఇలా వుందని ఎగ్ఙిబిటర్ వర్గాలు చెబుతున్నాయి.