జ‌గన్ మీకేల ఈ ‘తాపత్రయం’

పాలకుడు అనేవాడు ప్రజ‌ల మనోభీష్టం ప్రకారం నడుచుకోవాలి. సినిమా టికెట్ రేట్లు తగ్గించడం అన్నది ప్రజ‌లకు పెద్దగా నచ్చడం లేదు. సినిమా టికెట్ రేట్లు కాదు మిగిలినవి తగ్గించండి అంటున్నారు. పైగా ఇదంతా కక్షసాధింపు…

పాలకుడు అనేవాడు ప్రజ‌ల మనోభీష్టం ప్రకారం నడుచుకోవాలి. సినిమా టికెట్ రేట్లు తగ్గించడం అన్నది ప్రజ‌లకు పెద్దగా నచ్చడం లేదు. సినిమా టికెట్ రేట్లు కాదు మిగిలినవి తగ్గించండి అంటున్నారు. పైగా ఇదంతా కక్షసాధింపు అంటున్నారు. నానా యాగీ జ‌రుగుతోంది. పోనీ దీని వల్ల ప్రభుత్వం సాధించింది, దానికి ఒరిగింది ఏమైనా వుందా అంటే అదీ లేదు.

ప్రభుత్వం పోలీసులను, సిఆర్పీని, రెవెన్యూ యంత్రాగాన్ని మోహరించినా, తొలి రోజు ఈస్ట్ గోదావరిలో చాలాచోట్ల అయిదు ఆటలు వేసారు. సీడెడ్ లో 300 నుంచి 500 విక్రయించారు. ఆంధ్రలో దాదాపు చాలా సెంటర్లలో 200 అమ్మారు. ప్రభుత్వం ఏం పీక గలిగింది? రెండో రోజు కూడా రేట్లు కొన్ని చోట్ల ఎక్కువే వున్నాయి.

ఇప్పుడు కొత్త జీవో ఇస్తారు అనుకుందాం. అందులో కాస్త రేట్లు పెంచుతారు అనుకుందాం. కానీ దాన్ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయించగల సత్తా ప్రభుత్వానికి వుందా? లేదనే అనుకోవాలి. ఎందుకంటే అఖండ, భీమ్లా నాయక్ ఉదంతాలే ఉదాహరణ. అలాంటపుడు ఇక కొత్త జీవో అయితేనేం, పాత జీవో అయితేనేం. జ‌రిగేది ఒకటే.

ఇందుకు విరుగుడు ఒక్కటే కేసిఆర్ ను ఫాలో అయిపోవడమే.కేసిఆర్ తెలంగాణలో టికెట్ రేట్లు పెంచి ఇండస్ట్రీ అభిమానం చూరగొన్నారు. అందువల్ల ఇక ఎవరూ తప్పు పట్టరు. తెలంగాణ రేట్లు తెచ్చి ఆంధ్రలో అమలు చేసేయడమే. అప్పుడు కనీసం ప్రభుత్వానికి ఆదాయం అన్నా వస్తుంది. ఇక అంతకన్నా పెంచి అమలు చేసేది వుండదు. అందువల్ల అధికారుల కాపలా అక్కరలేదు.

ఇష్టం వున్న జ‌నం ఖర్చు పెట్టి సినిమాకు వెళ్తారు. లేని వాళ్లు టీవీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. జ‌గన్ కు మాట కూడా తప్పుతుంది. కాస్త ఆలోచించండి.