భీమ్లా నాయక్ విడుదలకు ముందు ఆ సినిమాను కూడా పాన్ ఇండియా సినిమాగా ప్రొజెక్ట్ చేసారు. పుష్ప సినిమా హిందీ బెల్ట్ లో హిట్ కావడంతో భీమ్లా నాయక్ సినిమాను కూడా హిందీ వెర్షన్ లో విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి.
కానీ భీమ్లా నాయక్ సినిమాను సడెన్ గా విడుదల చేయాల్సి వచ్చింది. రెండు డేట్ లు విడుదలకు ఫిక్స్ చేసుకుని, ముందు డేట్ కే వచ్చేసారు. దాంతో తెలుగు వెర్షన్ రెడీ చేసుకోవడానికే కిందా మీదా అయిపోయారు.
ఇక హిందీ వెర్షన్ ను పక్కన పెట్టారు. వన్ వీక్ లేట్ గా విడుదల చేస్తారని వార్తలు వినిపించాయి. వన్ వీక్ కాదు కదా, నెల దాటేసినా ఆ ప్రయత్నం కనిపించడం లేదు. ఇప్పుడు ఏకంగా ఓటిటి లోకి సినిమా వచ్చేస్తోంది. చూస్తుంటే హిందీ వెర్షన్ ను స్మూత్ గా స్కిప్ చేసేసినట్లు కనిపిస్తోంది.
భీమ్లా తెలుగు వెర్షన్ నే ఆశించిన మేరకు క్లిక్ కాలేదు. బయ్యర్లకు జిఎస్టీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. నైజాంలో మూడు కోట్లు బయ్యర్ కు నష్టం వచ్చినట్లు బోగట్టా. అందుకే ఇక హిందీ వెర్షన్ పక్కన పెట్టి వుంటారు. అయినా నిర్మాతకు హిందీ వెర్షన్ విడుదల లాభ నష్టాలతో సంబంధం లేదు. ఎందుకంటే ముందుగానే హిందీ రైట్స్ విక్రయించేసారు.