పొత్తు మాటెత్తిన తర్వాత.. పవన్ జట్టు వీక్!!

ఇంతకూ పవన్ కల్యాణ్ అత్యంత ఆవేశపూరితంగానూ, ఆవేశాత్మకంగానూ సాగించిన పార్టీ ఆవిర్భావ సభ చారిత్రాత్మక ప్రసంగం ఏం సాధించింది. పార్టీలో అది ఎలాంటి కొత్త ఉత్సాహాన్ని నింపింది. పార్టీకి ఎలాంటి లాభం చేకూరబోతోంది. అనే…

ఇంతకూ పవన్ కల్యాణ్ అత్యంత ఆవేశపూరితంగానూ, ఆవేశాత్మకంగానూ సాగించిన పార్టీ ఆవిర్భావ సభ చారిత్రాత్మక ప్రసంగం ఏం సాధించింది. పార్టీలో అది ఎలాంటి కొత్త ఉత్సాహాన్ని నింపింది. పార్టీకి ఎలాంటి లాభం చేకూరబోతోంది. అనే విషయాల గురించి ఆలోచించినప్పుడు.. పార్టీ కీలకనాయకులు లబోదిబో మంటున్నారు. 

పవన్ ప్రసంగం.. ప్రధానంగా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోబోతున్నాను అని సంకేతాలు వచ్చేలా చెప్పిన మాటలు పార్టీ పుట్టిముంచేలా ఉన్నాయని అందరూ గొల్లు మంటున్నారు. మొత్తానికి పవన్ ఏ ఉద్దేశంతో, ఎలాంటి ప్రయోజనాలను ఆశించి ఆ మాటలు చెప్పారో గానీ.. పార్టీ మాత్రం వీక్ అయింది. 

2019 ఎన్నికల్లో పార్టీ చాలా ఘోరమైన అవమానకరమైన రీతిలో ఓడిపోయినప్పటికీ.. ఆ పార్టీని నమ్ముకుని దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనూ ఇన్చార్జిలు రాజకీయంగా కష్టపడుతూనే ఉన్నారు. స్టోరీసిటింగులకు, షూటింగులకు మధ్య కాసింత గ్యాప్ దొరికితే పార్టీ మీద దృష్టి పెట్టే పవన్ కల్యాణ్ కంటె వారు క్షేత్రస్థాయిలో కాసింత ఎక్కువగానే కష్టపడుతున్నారు. అలా కష్టపడడం వల్ల ఫలితం ఉంటుందని వారు ఇన్నాళ్లుగా నమ్ముతున్నారు. 

పార్టీ బలోపేతం అయితే.. వచ్చే ఎన్నికలకు తాము ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో ఉంటాం అనే కల అందరికీ ఉంది. అయితే.. పవన్ కల్యాణ్ అలాంటి క్షేత్రస్థాయి నాయకులతో ఎవ్వరితోనూ సంప్రదించకుండానే.. తనంత తాను ఏకపక్షంగా పొత్తు సంకేతాలను ప్రకటించేశారు. పవన్ మాటలను బట్టి తెలుగుదేశం పార్టీ పండగ చేసుకుంటోంది. ఈ దెబ్బకు నియోజకవర్గాల్లోని జనసైనికులు, జనసేన నాయకులు డీలా పడిపోయారు. 

ఏదో బిజెపితో పొత్తు అనే మాట ముందునుంచి తెలిసిన సంగతే కాబట్టి.. ఆ పార్టీ బలంగా ఉన్నచోట్ల ఆశ వదలుకుని, మిగిలిన చోట్ల జనసేన నాయకులు కష్టపడుతున్నారు. ఇప్పుడు తెదేపాతో పొత్తు సంకేతాలు అధినేత నుంచి రావడంతో.. వారికి ఆశలుడిగిపోయాయి. తాము ఎంత కష్టపడ్డాసరే..చివరికి తమ నియోజకవర్గం పంపకాల్లో టీడీపీ పరమైందంటే.. తమ కష్టం మొత్తం వృథాపోతుందనే భయం వారిలో వ్యక్తమవుతోంది. 

అందుకే పార్టీ మీద ఖర్చు పెట్టడం, కష్టపడడం మానేసి.. సీట్ల పంపకాలు జరిగేదాకా వేచిచూస్తే.. తీరా ఆ సమయానికి సీటు తమ పార్టీకి వచ్చి, ఆ టికెట్ తమకు వస్తే అప్పుడు కష్టపడితే సరిపోతుందనే వైఖరి వారిలో ఏర్పడింది. 

ఇప్పటికిప్పుడు బయటకు కనిపించడం లేదు గానీ.. ఈ ధోరణి జనసేన పార్టీకి చాలా ప్రమాదకరమైనది. కింది స్థాయి నాయకుల్లో పొత్తుమాటలు పుట్టించిన వైరాగ్యాన్ని పార్టీలోని కీలక నాయకులు అర్థం చేసుకుని తలలు పట్టుకుంటున్నారు. ఈ పరిస్థితిని జనసేనానికి ఎలా చక్కదిద్దుకుంటారో చూడాలి.