మొత్తానికి అనుకున్నట్లే అయింది. సైరా దగ్గర నుంచి ఆచార్య మీదుగా గాడ్ ఫాదర్ వరకు రకరకాల ప్రయోగాలు చేసారు మెగాస్టార్ చిరంజీవి. ఏవీ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అలాంటి టైమ్ లో వాల్తేర్ వీరయ్య అనే రెగ్యులర్ ఫార్మాట్, డామ్ ఓల్డ్ స్టయిల్ సినిమా ఆడేసింది. అప్పుడు అర్థం అయింది. లేదా అదే కరెక్ట్ అనుకున్నారేమో? మెగాస్టార్ ఇప్పుడు ఈ ఫార్ములాకే ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది.
భోళాశంకర్ అనే సినిమా రాబోతోంది. దాని మీద ఈ ఫార్ములా ప్రభావం కచ్చితంగా పడుతున్నట్లు తెలుస్తోంది. రీమేక్ సినిమానే అయినా పూర్తిగా ఎంటర్ టైన్ మెంట్ ప్రధానంగా మార్చినట్లు తెలుస్తోంది.
జబర్దస్ట్ నటులు, ఇంకా పాపులర్ కమెడియన్లను తీసుకుని, వాళ్లతో కలిసి తన మార్క్ ఎంటర్ టైన్ మెంట్ కే మెగాస్టార్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటి వరకు అనుకున్న స్క్రిప్ట్ లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే పాటలు, డ్యాన్స్ లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మళ్లీ శేఖర్ మాస్టర్ తో మాంచి ఊపిచ్చే పాటలు చేయిస్తున్నారు. నిఙానికి వాల్తేర్ వీరయ్య ను క్రిటిక్స్ వైపు నుంచి యునానిమస్ గా నెగిటివ్ రిపోర్ట్ లు వచ్చాయి. కానీ జనానికి అదే ఫార్ములా నచ్చింది. అందుకే మరో థాట్ లేకుండా అదే దారిలో వెళ్లిపోతున్నారుస మెగాస్టార్.