మెగాస్టార్ చిరంజీవి హడావుడి గా మొదలు పెట్టిన ప్రాజెక్టుల్లో భోళాశంకర్ ఓకటి. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టును అలా వుంచి వాల్తేర్ వీరయ్య, గాడ్ ఫాదర్ సినిమాలను చకచకా ఫినిష్ చేస్తున్నారు. దీనికి కారణం మరేం లేదు.
మెగాస్టార్ సోలోగా సినిమాలు చేయడం మానేసారు. ఏవరో ఒక హీరో తోడు వుంటాల్సిందే. ఆచార్య కు రామ్ చరణ్, గాడ్ ఫాదర్ కు సల్మాన్, వాల్తేర్ వీరయ్యకు రవితేజ లను తీసుకున్నారు. ఇప్పుడు అలాగే ఈ భోళాశంకర్ కు కూడా మరో యంగ్ హీరో తోడు కావాలి.
అది ఎవరు అన్నదే సమస్య. హీరో నితిన్ ను అడిగారు. కానీ ఇప్పటి వరకు ఎస్ ఆర్ నో అన్నది తెలియలేదు. అందుకే అలా పెండింగ్ లో వుంచినట్లు తెలుస్తోంది.
నితిన్ కాదంటే ఆ రేంజ్ యంగ్ హీరో ఎవర్నయినా తీసుకోవాలి. మరో మెగా హీరో తొడు తీసుకోవడం అన్నది మెగాస్టార్ కు ఇష్టం లేనట్లు వుంది. లేదూ అంటే సాయిథరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ అంటూ ముగ్గురు వుండనే వున్నారు.
కానీ బయట హీరో కోసం వెదుకులాడుతున్నారు. ఆ క్రమంలోనే ఈ సినిమాను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన మెగాస్టార్ చేయబోయే ప్రతి సినిమాకు ఓ యంగ్ హీరో వెదుకులాట తప్పదేమో?