భూమికి పట్టిన క్యాన్సర్ మనిషేనేమో?

దర్శకుడు ప్రవీణ్ సత్తారు.. హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో నిర్మాత భోగవిల్లి ప్రసాద్ నిర్మించిన సినిమా గాండీవధారి అర్జున. ఈ నెల మూడోవారంలో విడుదలవుతున్న ఈ సినిమా ట్రయిలర్ ను విడుదల చేసారు.…

దర్శకుడు ప్రవీణ్ సత్తారు.. హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో నిర్మాత భోగవిల్లి ప్రసాద్ నిర్మించిన సినిమా గాండీవధారి అర్జున. ఈ నెల మూడోవారంలో విడుదలవుతున్న ఈ సినిమా ట్రయిలర్ ను విడుదల చేసారు. అవుట్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. స్టోరీ కన్నా నెరేషన్ నే కీలకం. ఓ అడ్వాన్స్ డ్ బర్నింగ్ ప్రాబ్లమ్ ను తీసుకుని, దాని చుట్టూ నెరేషన్ ను తిప్పినట్లు కనిపిస్తోంది.

ట్రయిలర్ లో ఆ ప్రాబ్లమ్ ను, కథ పాయింట్ ను లైట్ గా టచ్ చేసారు. యాక్షన్ సీన్లను ప్రెజెంట్ చేయడానికే ప్రయారిటీ ఇచ్చారు. ట్రయిలర్ లో పడిన ఈ సీన్లు అన్నీ క్వాలిటీతో, హాలీవుడ్ టచ్ తో వున్నాయి. వీటిలో కూడా హీరో వర్క్ కన్నా టెక్నికల్ వర్క్ నే ఎక్కువ కనిపించింది. 

ఇంటర్నేషనల్ బర్నింగ్ పాయింట్ ను టచ్ చేస్తూనే ఆంధ్ర గిరిజన ప్రాంతమైన లంబసింగిని కూడా చూపించారు అంటే కథ ఇక్కడికి అక్కడికి మధ్య లింక్ తో వుంటుందని అర్థం అవుతోంది.

ట్రయిలర్ ను ఓ జోష్ లో ముందుకు నడిపే విధంగా బ్యాక్ గ్రవుండ్ స్కోర్ సాగింది. మిక్కీ జే మేయర్ స్టయిల్ లో కాకుండా ఇది కొత్తగా వుంది. భూమికి పట్టిన అతి పెద్ద క్యాన్సర్ మనిషేనేమో?అనే డైలాగులతో ట్రయిలర్ ను ఎండ్ చేయడం ద్వారా ఓ మాంచి సామాజిక సమస్యను ప్రవీణ్ సత్తారు కీలకంగా తీసుకుని, డీల్ చేసినట్లు కనిపిస్తోంది.